కమ్మేసిన మంచు దుప్పటి.. తెలంగాణలోని ఆ రెండు జిల్లాలపై చలి పంజా…ఈ సీజన్‌లోనే అత్యల్పం

 అడవుల జిల్లా ఆదిలాబాద్‌పై చలి పంజా విసురుతోంది. రికార్డ్ స్థాయిలో పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలతో జనం విలవిల్లాడుతున్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నా...

కమ్మేసిన మంచు దుప్పటి..  తెలంగాణలోని ఆ రెండు జిల్లాలపై చలి పంజా...ఈ సీజన్‌లోనే అత్యల్పం
Follow us

|

Updated on: Dec 21, 2020 | 9:12 AM

అడవుల జిల్లా ఆదిలాబాద్‌పై చలి పంజా విసురుతోంది. రికార్డ్ స్థాయిలో పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలతో జనం విలవిల్లాడుతున్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉట్నూర్ ఐటీడీఏ ప్రాంతాలైన గిన్నెదరి, సిర్పూర్ ( యు ), నార్నూర్, ఇంద్రవెళ్లి ఏజెన్సీ మండలాలు, ఆదివాసీ గూడాలు చలికి గజగజ వణుకుతున్నాయి. తిర్యాణి మండలం గిన్నెధరి మినీ కాశ్మీర్‌గా మారుతోంది. ఇక్కడ రికార్ట్ స్థాయిలో 4.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్‌లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత. గిన్నెధరితో పాటు ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌(యు) 6, కెరమరి 6.7, తిర్యాణి 6.7, వాంకిడి 6.8 మండలాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో అర్లి ( టి ) 4.6, భీంపూర్ 4.9, బరంపూర్, తాంసి 4.9, బేలా 5, నేరడిగొండ 5.4, జైనథ్ 5.6, బోరజ్ 6.1, తలమడుగులో 6.4 అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబిలో 6.2, కుబీర్ 7.3, కుంటాల 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. సిటీలో కూడా టెంపరేచర్ పడిపోవడంతో భాగ్యనగర వాసులు ఇబ్బంది పడ్డారు. రాష్ట్రంలోని చాలా చోట్ల ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

Also Read :

Breaking : ఇంద్రపాలెం వద్ద విద్యుత్ తీగలు తగిలి కంటైనర్‌‌లో మంటలు.. 40 ద్విచక్రవాహనాలు అగ్నికి ఆహుతి

Bigg Boss Telugu 4 Winner : అభి’జీత్’‌ను గెలిపించిన అంశాలు ఇవే..వచ్చాడు..నిలిచాడు.. గెలిచాడు

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?