కరోనా వ్యాక్సిన్ పంపిణీపై సీఎం కీలక ప్రకటన

|

Oct 22, 2020 | 6:58 PM

కరోనా వైరస్ బారిన పడి ఇబ్బందుల పాలవుతున్న తమిళ ప్రజలకు గుడ్ న్యూస్ వినిపించారు అక్కడి ముఖ్యమంత్రి ఫళనిస్వామి. కరోనాకు వ్యాక్సిన్ వస్తే తమిళనాడులోని...

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై సీఎం కీలక ప్రకటన
Follow us on

CM crucial statement on corona vaccine: కరోనా వైరస్ బారిన పడి ఇబ్బందుల పాలవుతున్న తమిళ ప్రజలకు గుడ్ న్యూస్ వినిపించారు అక్కడి ముఖ్యమంత్రి ఫళనిస్వామి. కరోనాకు వ్యాక్సిన్ వస్తే తమిళనాడులోని ప్రతీ ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. పుదుకొట్టైలో మీడియాతో మాట్లాడిన ఫళనిస్వామి ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో అతి ఎక్కువగా కరోనా వైరస్ సోకిన వ్యక్తులున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటన్న విషయం విధితమే.

బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ వ్యాక్సిన్‌ ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో వచ్చే సంవత్సరం ఎన్నికలకు వెళుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడం విశేషం. బీహార్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐసీఎంఆర్ ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ ఫ్రీగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇదే అంశాన్ని మ్యానిఫెస్టోలో చేర్చిన విషయాన్ని ఆమె వెల్లడించారు.

వచ్చే సంవత్సరం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అధికార ఏఐఏడీఎంకే తరపున సీఎం అభ్యర్థిగా ఎంపికైన ఫళనిస్వామి.. ప్రజలకు విరివిగా తాయిలాలు ప్రకటిస్తూ వెళుతున్నారు. రాష్ట్రంలో కరోనాను నియంత్రించే విషయంలో ఫళని ప్రభుత్వం విఫలమైందని విపక్ష డీఎంకే అధినేత స్టాలిన్ ఆరోపిస్తున్న నేపథ్యంలో సీఎం ఫళనిస్వామి వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించడం విశేషం.

Also read: సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాల వెల్లువ.. ఎవరెంత అంటే..?

Also read: వైమానిక దాడుల్లో 8 మంది పౌరులు హతం

Also read:  అమరావతిలో స్తబ్దత.. రాజధానిపై చంద్రబాబు కీలక ట్వీట్

Also read: అరెస్టును అడ్డుకుని హంగామా చేసిన మహిళలు

Also read: పొద్దుటూరులో భారీ గోల్డ్ గోల్‌మాల్

Also read: “నాగ్” మిసైల్ ప్రయోగం సక్సెస్

Also read: పాకిస్తాన్‌పై నిప్పులు గక్కిన యూరోపియన్ పార్లమెంటు