వైమానిక దాడుల్లో 8 మంది పౌరులు హతం

అఫ్ఘనిస్తాన్‌లో జరిగిన వైమానిక దాడులు, అనంతరం జరిగిన ఆయుధ ఘర్షణలో ఎనిమిది మంది మరణించినట్లు ఎఎన్ఐ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. మరో ఎనిమిది మంది…

  • Rajesh Sharma
  • Publish Date - 3:54 pm, Thu, 22 October 20

Civilians died in airstrikes in Afghanistan:  అఫ్ఘనిస్తాన్‌లో జరిగిన వైమానిక దాడులు, అనంతరం జరిగిన ఆయుధ ఘర్షణలో ఎనిమిది మంది మరణించినట్లు ఎఎన్ఐ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. ఈ వైమానిక దాడులు బుధవారం అర్ధరాత్రి ప్రాంతంలో జరిగినట్లు సమాచారం.

అఫ్ఘనిస్తాన్‌లోని టఖర్ ప్రావిన్స్ ఉత్తర ప్రాంతంలో ఈ వైమానిక దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల తర్వాత ఆయుధ ఘర్షణలు చోటుచేసుకున్నాయని, అందులో ఎనిమిది మంది పౌరులు దుర్మరణం పాలయ్యారని అధికార యంత్రాంగం ప్రకటించింది. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.

హజారా కెష్లాక్ అనే ప్రాంతంలో అఫ్ఘన్ సైనికులకు, తాలిబన్ తీవ్రవాదులకు మధ్య చోటుచేసుకున్నాయి. ఈ కాల్పులను నిరోధించేందుకు రంగంలోకి దిగిన అఫ్ఘన్ ఎయిర్‌ఫోర్టు వైమానిక దాడులను ప్రారంభించింది. మంగళవారం నుంచి బుధవారం అర్ధరాత్రి దాటే దాకా కొనసాగిన ఈ ఎయిర్‌స్ట్రైక్‌లోను, తాలిబన్ల రిటాలియేషన్‌లోను ఎనిమది మంది పౌరులు మరణించారు.

అటు సైనిక వర్గాల్లోను, ఇటు తాలిబన్ తీవ్రవాదుల్లోను ఎంత మంది మరణించారనేది ఇంకా ధృవీకరణ జరగలేదు. అయితే ఏడుగురు తాలిబన్ తీవ్రవాదులను మట్టుబెట్టినట్లు సైన్యం ప్రకటించుకుంది. టఖర్ ప్రావిన్స్‌లోని ఉత్తర ప్రాంతంలో ఈ మధ్య కాలంలో తాలిబన్లకు, సైన్యానికి మధ్య తరచూ కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.

అయితే, తాలిబన్ల దాడుల్లో పలువురు సైనికులు మరణించడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు సైన్యం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వైమానిక దాడులకు తెగబడిందని స్థానికులు చెబుతున్నారు. టఖర్ ప్రావిన్స్‌పై ఆధిపత్యానికి తాలిబన్ తీవ్రవాదులు చాలాకాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

Also read: పాకిస్తాన్‌పై నిప్పులు గక్కిన యూరోపియన్ పార్లమెంటు

Also read:  అమరావతిలో స్తబ్దత.. రాజధానిపై చంద్రబాబు కీలక ట్వీట్

Also read: అరెస్టును అడ్డుకుని హంగామా చేసిన మహిళలు

Also read: పొద్దుటూరులో భారీ గోల్డ్ గోల్‌మాల్

Also read: “నాగ్” మిసైల్ ప్రయోగం సక్సెస్