AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దాసరి కుటుంబంలో అన్నాదమ్ముల సవాల్

దివంగత దాసరి నారాయణ రావు కుటుంబంలో మరో చిచ్చు రాజుకుంది. ఇద్దరు కుమారుల మధ్య ఆస్తి వివాదం అగ్గి రాజేసింది. అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి గొడవలు దాడుల వరకు వెళ్లి.. అది పోలీస్ స్టేషన్‌కు చేరింది.

దాసరి కుటుంబంలో అన్నాదమ్ముల సవాల్
Jyothi Gadda
|

Updated on: Jun 26, 2020 | 2:08 PM

Share

దివంగత దాసరి నారాయణ రావు కుటుంబంలో మరో చిచ్చు రాజుకుంది. ఇద్దరు కుమారుల మధ్య ఆస్తి వివాదం అగ్గి రాజేసింది. అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి గొడవలు దాడుల వరకు వెళ్లి.. అది పోలీస్ స్టేషన్‌కు చేరింది. పూర్తి వివరాలు పరిశీలంచగా..

దాసరి నారాయణ రావు చిన్న కొడుకు అరుణ్‌పై పెద్ద కుమారుడు ప్రభు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈనెల 24న రాత్రి 10 గంటల సమయంలో దాసరి అరుణ్ కుమార్.. తన ఇంట్లోకి చొరబడి తమపై దాడి చేశాడని ప్రభు ఆరోపించారు. తాగి మైకంలో నోటికి వచ్చినట్లుగా తిడుతూ.. తమపై చేయి చేసుకున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి మా నాన్న బీరువా ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారని, అడ్డుకున్న తమపై దాడికి దిగినట్లు చెప్పారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. రౌడీలతో బెదిరిస్తున్నారని అన్నారు. ఈ దాడిలో దాసరి అరుణ్ కుమార్, అతడి కారు డ్రైవర్ ఇద్దరు గేటు దూకి లోపలికి ప్రవేశించారని, మరికొంతమంది గేటు బయటే ఉన్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆస్తి కోసమే తమ తమ్ముడు అరుణ్ కుమార్ తనను వేధిస్తున్నాడని దాసరి ప్రభు జూబ్లీ హిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

దాసరి అరుణ్ వెనుక ఉన్న కొందరు పెద్ద మనుషులే తమపై ఇలా దాడులు చేసేలా ప్రేరేపిస్తున్నారంటూ ప్రభు పలువురిపై అనుమానాలు వ్యక్తం చేశారు. దాసరి నారాయణ రావు..ఇంటిని తన మనవరాలి పేరుపై రాశారని ప్రభు అంటున్నారు. మా నాన్న వీలునామా ప్రకారం ఇల్లు తన కూతురికే దక్కుతుందని చెప్పారు. తమ ఇంట్లో నెలకొన్న పరిస్థితులపై మురళీ మోహన్, మోహన్ బాబు వంటి తదితరులను కలిసి వివరించానన్నారు. ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటికైన ముందుకు వచ్చి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇద్దరినీ కూర్చోబెట్టి ఆస్తి పంపకాలు జరిపించాలని కోరుతున్నారు.

దాసరి నారాయణ రావు సంబంధించిన అనేక ఆస్తులపై సరైన లెక్కలు, పత్రాలు లేవని దాసరి ప్రభు అన్నారు. రోడ్ నెం. 44 సినీ మీడియా కాంప్లెక్స్..ను బలవంతంగా అమ్మేశారని చెప్పారు. దాసరి ఫామ్ హౌజ్ ను 3 ఎకరాలు మినహా మిగతాదంతా అమ్మేశారని ఆ డబ్బులు ఏవీ ఇంకా లెక్క తేలలేదన్నారు. చందానగర్ లోని 33 అపార్ట్ మెంట్లకు సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదని అన్నారు.

ఏదేమైనప్పటికీ సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచిన దాసరి నారాయణ రావు ఫ్యామిలీలో రాజుకున్న వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఆయన కుటుంబంలో నెలకొంటున్న వివాదాలు ఆయన ప్రతిష్టకు మచ్చతెచ్చేలా మారాయని దాసరి అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us
లక్ష్మీ పార్వతి చిన్న పిల్లలా చూసుకున్నారు: టాలీవుడ్ నటి
లక్ష్మీ పార్వతి చిన్న పిల్లలా చూసుకున్నారు: టాలీవుడ్ నటి
రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సహకరించండిః కిషన్ రెడ్డి
రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సహకరించండిః కిషన్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు
గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం.. వెలుగులోకి గగుర్పొడిచే నిజం
గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం.. వెలుగులోకి గగుర్పొడిచే నిజం
పంజాబ్-రాజస్థాన్ పోరుకు వాన గండం.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్?
పంజాబ్-రాజస్థాన్ పోరుకు వాన గండం.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్?
పెను మార్పులు.. 90 రోజులు దాటితే మొండి బాకీ.. ఇక దబిడి దిబిడే..
పెను మార్పులు.. 90 రోజులు దాటితే మొండి బాకీ.. ఇక దబిడి దిబిడే..
ఆ హీరోని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా..
ఆ హీరోని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా..
ఎలిమినేట్ చేసేయండి సార్.! కింగ్‌లు అనుకుంటే బొంగు అయ్యారు..
ఎలిమినేట్ చేసేయండి సార్.! కింగ్‌లు అనుకుంటే బొంగు అయ్యారు..
ప్రతిరోజూ మందార టీ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే! ఇన్ని లాభాల
ప్రతిరోజూ మందార టీ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే! ఇన్ని లాభాల
జొన్న పిండి గారెల రుచేవేరండి ఒకటి రెండుతో ఆగరు..
జొన్న పిండి గారెల రుచేవేరండి ఒకటి రెండుతో ఆగరు..