ప్రముఖ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులు

సినీ పరిశ్రమలో మరో వేధింపుల ఘటన వెలుగు చూసింది. బాలీవుడ్‌లో అగ్ర కొరియోగ్రాఫర్‌గా పేరు గాంచిన గణేశ్ ఆచార్యపై ఓ మహిళ లైంగిక ఆరోపణల కేసు పెట్టారు. కొరియోగ్రాఫర్, నటుడు గణేశ్ తనను వేధిస్తున్నాడంటూ.. ఓ మహిళా డ్యాన్స్ మాస్టర్.. మహారాష్ట్ర మహిళా కమిషన్, ముంబాయిలోని అంబోలీ పీఎస్ ఫిర్యాదు చేశారు. తనకు కావాలనే గణేశ్ ప్రాజెక్టులను దక్కనివ్వడం లేదని, కమిషన్ డిమాండ్ చేస్తున్నాడని, అలాగే అశ్లీల వీడియోలు చూడమని ఒత్తిడి తీసుకొస్తున్నాడని ఆ మహిళ ఫిర్యాదులో […]

ప్రముఖ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులు
Follow us

| Edited By:

Updated on: Jan 28, 2020 | 11:17 AM

సినీ పరిశ్రమలో మరో వేధింపుల ఘటన వెలుగు చూసింది. బాలీవుడ్‌లో అగ్ర కొరియోగ్రాఫర్‌గా పేరు గాంచిన గణేశ్ ఆచార్యపై ఓ మహిళ లైంగిక ఆరోపణల కేసు పెట్టారు. కొరియోగ్రాఫర్, నటుడు గణేశ్ తనను వేధిస్తున్నాడంటూ.. ఓ మహిళా డ్యాన్స్ మాస్టర్.. మహారాష్ట్ర మహిళా కమిషన్, ముంబాయిలోని అంబోలీ పీఎస్ ఫిర్యాదు చేశారు. తనకు కావాలనే గణేశ్ ప్రాజెక్టులను దక్కనివ్వడం లేదని, కమిషన్ డిమాండ్ చేస్తున్నాడని, అలాగే అశ్లీల వీడియోలు చూడమని ఒత్తిడి తీసుకొస్తున్నాడని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా.. గణేశ్ ఆచార్య ఇండియన్ ఫిల్మ్, టెలివిజన్ కొరియోగ్రాఫర్స అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.