Breaking : చిత్తూరు జిల్లాలో మినీ బస్సు బోల్తా, ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లా మదనపల్లె- పుంగనూరు రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె నుంచి బండకిందపల్లికి వెళ్తున్న ఓ ప్రైవేట్ మినీ బస్సు బోల్తా పడింది.

Breaking : చిత్తూరు జిల్లాలో మినీ బస్సు బోల్తా, ముగ్గురు మృతి

Updated on: Nov 03, 2020 | 5:26 PM

చిత్తూరు జిల్లా మదనపల్లె- పుంగనూరు రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె నుంచి బండకిందపల్లికి వెళ్తున్న ఓ ప్రైవేట్ మినీ బస్సు బోల్తా పడింది. ఈ యాక్సిడెంట్‌లో ముగ్గురు స్పాట్‌లో మృతి చెందగా.. మరో 20మంది గాయపడ్డారు. క్షతగాత్రులను మదనపల్లె గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. మృతులు ముగ్గురు ఎర్రబల్లి, బండకిందపల్లికి చెందిన వారిగా పోలీసుల ప్రాథమికంగా నిర్దారించారు. మితిమీరిన వేగంతో వెళ్తోన్న బస్సు..కంట్రోల్ కాక బండరాయిని ఢీకొట్టడమే  యాక్సిడెంట్‌కు కారణంగా తెలుస్తోంది. కేవలం 15 సీట్లున్న ప్రైవేట్ మినీ బస్సులో….30మందికి పైగా ప్రయాణిస్తున్నారు.

Also Read :

పంటల భీమా పథకం పేరు మార్చిన జగన్ సర్కార్..

యువతి ప్రాణం తీసిన మొబైల్ లోన్ యాప్‌లు !

హీరో ఎలక్ట్రిక్‌ ఇ-స్కూటర్లపై రూ.5,000 వరకు డిస్కౌంట్