AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిక్కుల్లో సైరా… ఈసారి కష్టమే…!!

నిన్న వాల్మీకి, నేడు సైరా.. మెగా హీరోల సినిమాలకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బంధువులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సినిమా స్టోరీ కోసం తమ దగ్గరనుంచి అన్ని ఆధారాలు తీసుకుని.. ఇప్పుడు పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబానికి చెందిన 22 మంది బంధువులను సినిమా యూనిట్ గుర్తించి.. సినిమా షూటింగ్ ప్రారంభ సమయంలో వీరికి న్యాయం చేస్తామని డైరెక్టర్, ప్రొడ్యూసర్ హామీ ఇచ్చారు. […]

చిక్కుల్లో సైరా... ఈసారి కష్టమే...!!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 21, 2019 | 8:28 PM

Share

నిన్న వాల్మీకి, నేడు సైరా.. మెగా హీరోల సినిమాలకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బంధువులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సినిమా స్టోరీ కోసం తమ దగ్గరనుంచి అన్ని ఆధారాలు తీసుకుని.. ఇప్పుడు పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబానికి చెందిన 22 మంది బంధువులను సినిమా యూనిట్ గుర్తించి.. సినిమా షూటింగ్ ప్రారంభ సమయంలో వీరికి న్యాయం చేస్తామని డైరెక్టర్, ప్రొడ్యూసర్ హామీ ఇచ్చారు. సినిమా షూటింగ్ కోసం వారి స్థలాలను, ఆస్తులను వాడుకున్నారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని ఎన్నోసార్లు చిత్రయూనిట్ ని కలిశామని.. చివరికి న్యాయం జరగకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి 5వ తరం వారసులైన దస్తగిరి రెడ్డి, లక్ష్మీ చెబుతున్నారు. చట్టపరంగా 23 మందికి రూ. 50 కోట్లు, కథ చెప్పినందుకు రూ.2 కోట్లు ఇస్తామని అగ్రిమెంట్ తీసుకుని ఇప్పుడు చిత్రయూనిట్ మోసం చేసిందని బాధితులు వాపోతున్నారు.

ఉయ్యాలవాడ వారసుల్ని సైరా చిత్ర బృందం చీటింగ్ చేసిందని న్యాయవాది జనార్థన్ రెడ్డి టీవీ9 తెలుగు న్యూస్ ఛానల్‌తో తెలిపారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారని.. ఎఫ్ఐఆర్ నమోదైందని అన్నారు. ఉయ్యాలవాడ కుటుంబానికి న్యాయం చేయకపోతే.. రేపు విడుదల చేయనున్న ప్రీ రిలీజ్‌ను అడ్డుకుంటామని చెప్పారు. ఫిర్యాదుకు అన్ని ఆధారాలు సమర్పించామన్నారు.

చిరంజీవి, రామ్ చరణ్ తమను మోసం చేశారని.. తమకు న్యాయం జరగే విధంగా చేయాలని ఉయ్యాలవాడ వారసులు టీవీ9ను ఆశ్రయించారు. రామ్ చరణే స్వయంగా తమతో మాట్లాడి నోటరీ తయారు చేయించారని.. మొత్తం 22 మందితో సంతకాలు చేయించుకున్నారని చెప్పారు. సినిమా అయిపోయింది ఇంకేం చేయలేరని.. ఇచ్చిన హామీలు మరిచి ఇప్పుడు తమకు అన్యాయం చేశారని బాధితులు వాపోతున్నారు.

Follow Us
కరీంనగర్ యువతి సత్తా.. ఏకంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో కొలువు!
కరీంనగర్ యువతి సత్తా.. ఏకంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో కొలువు!
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం సూపర్ స్కీమ్
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం సూపర్ స్కీమ్
కాంచీపురం అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో అపశృతి.. ఇద్దరు భక్తులు మృతి
కాంచీపురం అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో అపశృతి.. ఇద్దరు భక్తులు మృతి
ఆసియా కప్‌నకు పాక్ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్ ఆ రోజే
ఆసియా కప్‌నకు పాక్ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్ ఆ రోజే
6 తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో అందరికీ ఒకే ఇల్లు.. ఒకే వంట
6 తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో అందరికీ ఒకే ఇల్లు.. ఒకే వంట
శ్రావణ మాసంలో అష్ట లక్ష్మి యోగం.. వీరికి పట్టింది బంగారమే!
శ్రావణ మాసంలో అష్ట లక్ష్మి యోగం.. వీరికి పట్టింది బంగారమే!
చెల్లికి చివరి మెసేజ్ పంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్వ్‌వేర్ ఉద్యోగి
చెల్లికి చివరి మెసేజ్ పంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్వ్‌వేర్ ఉద్యోగి
కిచెన్‌లో పడగవిప్పి నాగుపాము ఏం చేసిందంటే.. ఇదిగో వీడియో
కిచెన్‌లో పడగవిప్పి నాగుపాము ఏం చేసిందంటే.. ఇదిగో వీడియో
ప్రతి నెలా కేవలం రూ.600 డిపాజిట్ చేస్తే చాలు.. చేతికి రూ.1 లక్ష
ప్రతి నెలా కేవలం రూ.600 డిపాజిట్ చేస్తే చాలు.. చేతికి రూ.1 లక్ష
కావాల్సింది జిమ్ బాడీ కాదు.. టీమిండియాలో బ్లండర్ మిస్టేక్ అదే
కావాల్సింది జిమ్ బాడీ కాదు.. టీమిండియాలో బ్లండర్ మిస్టేక్ అదే