దిగ్దర్శకుడు విశ్వనాథ్‌తో చిరంజీవి భేటీ.. దీపావళి పర్వదినాన మెగాస్టార్ అనూహ్య చర్య.. విశ్వనాథ్ ఇంటికి మెగాస్టార్ దంపతులు

|

Nov 14, 2020 | 3:21 PM

దీపావళి పర్వదినాన దిగ్దర్శకులు కే.విశ్వనాథ్‌ను కలిశారు మెగాస్టార్ చిరంజీవి దంపతులు. విశ్వనాథ్ దంపతులకు పండుగ సందర్భంగా పట్టుబట్టలు అందజేసి, వారి...

దిగ్దర్శకుడు విశ్వనాథ్‌తో చిరంజీవి భేటీ.. దీపావళి పర్వదినాన మెగాస్టార్ అనూహ్య చర్య.. విశ్వనాథ్ ఇంటికి మెగాస్టార్ దంపతులు
Follow us on

Chiranjeevi met director Vishwanath: దీపావళి పర్వదినాన దిగ్దర్శకులు కే.విశ్వనాథ్‌ను కలిశారు మెగాస్టార్ చిరంజీవి దంపతులు. విశ్వనాథ్ దంపతులకు పండుగ సందర్భంగా పట్టుబట్టలు అందజేసి, వారి ఆశీర్వచనం తీసుకున్నారు చిరంజీవి దంపతులు. దీపావళి పర్వదినాన మెగాస్టార్ స్వయంగా వచ్చి శుభాకాంక్షలు అందజేయడంతో సీనియర్ దర్శకులు విశ్వనాథ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చి, తన ప్రతి సినిమాతో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకులు కే. విశ్వనాథ్ మెగాస్టార్ చిరంజీవి గారికి మధ్య గురు శిష్యుల సంబంధం ఉన్న విషయం అందరికి తెలిసిందే. విశ్వనాథ్ దర్శకత్వంలో చిరు నటించిన శుభలేఖ, ఆపద్భాంధవుడు, స్వయంకృషి వంటి సినిమాలు మెగాస్టార్ కెరియర్‌లో మైలురాయిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి. మెగాస్టార్ మాస్ హీరోగా మాత్రమే కాదు, ఫ్యామిలీ అండ్ క్లాసికల్ సినిమాలలో సైతం అద్భుతంగా నటించి ఏ సినిమాకైనా వన్నె తేగలరు అని నిరూపించాయి విశ్వనాథ్-చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు.

తనని క్లాస్ అండ్ క్లాసికల్ హీరోగా నిలబెట్టిన దర్శకనాధుడు విశ్వనాథ్‌ని దీపావళి సందర్భంగా సతీసమేతంగా మెగాస్టార్ చిరంజీవి కలుసుకున్నారు. ఇండస్ట్రీలో అగ్రస్థానంలో వున్న చిరంజీవి తన ఇంటికి రావడం పట్ల కాశీ విశ్వనాథ్ ఆనందం వ్యక్తం చేశారు. కాసేపు ఇద్దరు తమ మధుర జ్ఞాపకాలను, అప్పటి సినిమా విశేషాలను గుర్తుచేసుకున్నారు. విశ్వనాథ్ ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకున్నారు చిరంజీవి.

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవిగారు మాట్లాడుతూ.. ‘‘ విశ్వ‌నాథ్ గారిని క‌ల‌వాల‌నిపించి ఈరోజు ఆయ‌న ఇంటికి రావ‌డం జ‌రిగింది. ఆయ‌న నాకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు తీశారు. ఈ దీపావ‌ళి సంద‌ర్భంగా ఆయ‌న్ని క‌ల‌వ‌డం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అంద‌రికీ కూడా దీపావ‌ళి శుభాకాంక్ష‌లు’’ అని అన్నారు.

ALSO READ: తెలంగాణ ప్రజలకు కేటీఆర్ గ్రేట్ న్యూస్… 50% శాతం రాయితీ

ALSO READ: పారిశుధ్య కార్మికులకు బంపర్ ఆఫర్.. దీపావళి నాడు..