AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BREAKING NEWS : పట్టుబడిన చైనా ‘లేడీ గూఢచారి’

కరోనా మహమ్మారి అమెరికాను కబలిస్తోంది. వేల సంఖ్యలో అమెరికన్లు చావుతో పోరాడుతున్నారు. దీంతో చైనాపై అమెరికా కస్సు..బుస్సు మంటోంది. చైనాకు, అమెరికాకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే..

BREAKING NEWS : పట్టుబడిన చైనా 'లేడీ గూఢచారి'
Sanjay Kasula
|

Updated on: Jul 24, 2020 | 9:05 PM

Share

Chinese Lady SPY Caught in America : కరోనా మహమ్మారి అమెరికాను కబలిస్తోంది. వేల సంఖ్యలో అమెరికన్లు చావుతో పోరాడుతున్నారు. దీంతో చైనాపై అమెరికా కస్సు..బుస్సు మంటోంది. చైనాకు, అమెరికాకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో సంబంధాలు బలహీనపడ్డాయి. చైనాపై అగ్రరాజ్యం తీవ్ర ఆరోపణలు చేయడం, వాటిని డ్రాగన్‌ కొట్టిపడేయడం చూస్తూనే ఉన్నాం.

గత కొంతకాలం క్రితం అమెరికా అగ్ర కంపెనీలైన ఆపిల్‌, అమెజాన్‌ వంటి 20 కంపెనీలపై చైనా గూఢచార్యం చేస్తుందని ఓ యూఎస్‌ పత్రిక ప్రచురించడంతో పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. చైనా ఫ్యాక్టరీలు తయారుచేసిన మదర్‌బోర్డును వాడుతున్న అమెరికా కంపెనీలపై డ్రాగన్‌ గూఢచార్యం చేస్తుందని… ఆ మదర్‌బోర్డ్‌లో ఓ మైక్రోచిప్‌ను అమర్చి, అమెజాన్‌, ఆపిల్‌ వంటి 28 ఇతర అమెరికా కంపెనీలు, సంస్థల సర్వర్లను చైనా హ్యాక్‌ చేస్తుందని తెలిపింది.

అయితే ఇప్పుడు ఏకంగా ఓ చైనా గూఢాచారి పట్టుబడటంతో అమెరికా ఉలిక్కి పడింది. అదికూడా ఓ చైనా మిలటరీ అధికారి.  తన అందచందాలతో జానాబెత్తల జానమ్మగా మారిందట. అమెరికన్లను తన బ్యూటీతో ముంచేసి అక్కడి సమాచారాన్ని చోరీ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది.

అమెరికాలోకి ఓ విద్యార్థిలా ఎంట్రీ ఇచ్చింది. అక్కడి కేన్సర్ ఆస్పత్రిలో రిసెర్చ్ స్టూడెంట్‌గా చేరింది. నెమ్మదిగా అక్కడి సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నట్లుగా FBI అధికారులు గుర్తించారు. పట్టుబడిన తర్వాత ఆమెకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. గూఢాచర్యం నిర్వహిస్తున్న యువతి  చైనీస్ మిలటరీ ఆఫిసర్ “తంగ్ జువాన్”గా గుర్తించారు. అయితే ఇలా దేశంలోకి మొత్తం 25 మంది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారులు వచ్చినట్లుగా FBI గుర్తించింది. వారిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలను ముమ్మరం చేసింది.