118 యాప్స్ బ్యాన్ చేయడంపై చైనా స్పందన
భారత సార్వభౌమత్వానికి, సమగ్రతకు, రక్షణకు ప్రతికూలంగా పనిచేస్తున్నాయంటూ... అత్యంత జనాదరణ పొందిన ఆన్‌లైన్ గేమింగ్ యాప్ పబ్‌జీ సహా 118 చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

భారత సార్వభౌమత్వానికి, సమగ్రతకు, రక్షణకు ప్రతికూలంగా పనిచేస్తున్నాయంటూ… అత్యంత జనాదరణ పొందిన ఆన్‌లైన్ గేమింగ్ యాప్ పబ్‌జీ సహా 118 చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిపై చైనా స్పందించింది. 118 యాప్స్ బ్యాన్ చెయ్యడం అటు భారతీయ వినియోగదారులకు, ఇటు చైనా వ్యాపారాలకు ప్రయోజనకరం కాదని చెప్పింది. ఈ చర్య డబ్ల్యూటీఓ(ప్రపంచ వాణిజ్య సంస్థ ) నిబంధనలను ఉల్లంఘించటమే అని పేర్కొంది. భారత నిర్ణయం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్ గురువారం తెలిపారు. చైనా కంపెనీల పట్ల వివక్షాపూరిత ఆంక్షలు విధించటం ద్వారా భారతదేశం ”జాతీయ భద్రత” అంశాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.
చైనా సంస్థలు ఇతర దేశాల్లో కార్యకలాపాలు సాగించేటపుడు అంతర్జాతీయ నిబంధనలను, స్థానిక చట్టాలు, నియంత్రణలను పాటించాలని చైనా గవర్నమెంట్ ఎప్పుడూ చెప్తూనే ఉందని గావో పేర్కొన్నారు. అంతేకాదు ఓపెన్ ఎకానమిగా ఉన్నఇండియాలో పెట్టుబడి వాతావరణాన్ని కూడా ఈ చర్య దెబ్బతీస్తుంది అని వ్యాఖ్యానించారు.ఈ క్రమంలో ఇండియా గవర్నమెంట్ తన తప్పును తక్షణమే సరిదిద్దాలని చైనా కోరింది.
Also Read :
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇంట విషాదం




