మసీదుల్లో కోవిడ్‌ నిబంధనలను పాటించాలి..

రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా‌ నిబంధనలను అనుసరించే మసీదుల్లో ప్రార్ధనలు నిర్వహించాలని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ ‌అలీ సూచించారు. చారిత్రక మక్కామసీదు, షాహీమసీదుల్లో..

  • Sanjay Kasula
  • Publish Date - 4:10 pm, Fri, 4 September 20
మసీదుల్లో కోవిడ్‌ నిబంధనలను పాటించాలి..

రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా‌ నిబంధనలను అనుసరించే మసీదుల్లో ప్రార్ధనలు నిర్వహించాలని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ ‌అలీ సూచించారు. చారిత్రక మక్కామసీదు, షాహీమసీదుల్లో ప్రార్ధనల పునరుద్దరణ ప్రక్రియను చర్చించేందుకు తన కార్యాలయాలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

ఎమ్మెల్మేలు ముంతాజ్‌అహ్మద్‌ఖాన్‌, అహ్మద్‌పాషా ఖాద్రి, మైనారిటీ సంక్షేమ సలహాదారు ఎకెఖాన్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ నదీమ్‌ అహ్మద్‌, మైనారిటీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ షానవాజ్‌ఖాన్‌, జిల్లా మైనారీటీ సంక్షేమఅధికారి మహ్మద్‌ఖాసిమ్‌, తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు మసీదుల్లో 50 మందికి అనుమతించారు. ఇది సెప్టెంబరు 5వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు.

ప్రార్ధనల సమయంలో మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని హోంమంత్రి ప్రజలకు విజ్ఞప్తిచేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం 10 సంవత్సరాలలోపు, 65 సంవత్సరాలపై బడిన వారు తమ ఇళ్లలోనే ప్రార్ధనలు చేసుకోవచ్చాని అన్నారు. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే వరకూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని అన్నారు.