రేపటి నుంచి చెన్నై వేదికగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభం కానుంది. జనవరి 6 వరకు సుమారు వారం రోజుల పాటు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కొనసాగనుంది. ఏటా చెన్నై నగరంలో జరిగే ఈ కార్యక్రమం కరోనా కారణంగా గత రెండేళ్లుగా నామమాత్రంగానే నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వేడుకగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా డాక్టర్ కలైంజర్ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(సీఐఎఫ్‌ఎఫ్) పేరుతో ఇండో సినీ అప్రిసియేషన్ ఈ ఈవెంట్‌ను నిర్వహించనుంది. పీవీఆర్, OneMercuri తో పాటు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ చిత్రోత్సవం జరగనుంది. కాగా రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమై రాత్రి 9.30 గంటలకు ముగుస్తుంది.
కాగాఈ చిత్రోత్సవంలో భాగంగా సుమారు 60 దేశాలకు చెందిన 121 చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, గుజరాతీ, మరాఠీ, బెంగాళీ తదితర భారతీయ భాషా సినిమాలను కూడా ప్రదర్శించనున్నారు. చెన్నై నగరంలోని సత్యం, పీవీఆర్, ఎస్డీసీ అన్నా సినిమా థియేటర్లలో ఈ చిత్రాలను ప్రదర్శిస్తారు. కాగా తమిళం నుంచి ధనుష్ నటించిన ‘కర్ణన్’, తో పాటు ‘ఐందు ఉణర్వుగల్’, ‘భూమిక’, కట్టిల్’, ‘మారా’, ‘తేన్’ తదితర చిత్రాలు స్పెషల్ స్ర్కీనింగ్‌కు ఎంపికయ్యాయి. కాగా ఫిల్మ్ యూనియన్‌ల సభ్యులు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్‌లకు రిజిస్ట్రేషన్ ఫీజులో రాయితీలు అందించనున్నట్లు ఫెస్టివల్ నిర్వాహకులు తెలిపారు. ఇక నేరుగా ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరవ్వాలనుకుంటే వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆర్గనైజర్స్ పేర్కొన్నారు.
Also Read:
Alia bhatt: ఆర్‌ఆర్‌ఆర్ బ్యూటీకి అరుదైన గౌరవం.. మూగజీవాలపై ప్రేమకు గుర్తుగా..
Irfan Pathan: రెండోసారి తండ్రైన టీమిండియా మాజీ క్రికెటర్.. ముద్దుల కుమారుడికి ఏం పేరు పెట్టాడంటే..
Sudan Gold Mine: కుప్పకూలిన బంగారు గని.. 38 మంది మృతి.. పదుల సంఖ్యలో క్షతగాత్రులు!