
చాలా స్పీడుగా డెవలప్ అవుతోన్న గ్రేటర్ సిటీ హైదరాబాద్ లో మోసాలు కూడా అదే స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. తాజాగా జుంబా డ్యాన్స్ పేరుతో ఓ కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. జుంబా డ్యాన్స్ చేస్తే ఫిట్ నెస్ ఓ రేంజ్ లో ఉంటుందంటూ నమ్మించిన ఓ మోసగాడు..కస్టమర్ల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. అయితే ఎంతకీ ట్రైనింగ్ ప్రారంభించకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న పలువురు మహిళలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
నగరంలోని సంపన్న ప్రాంతాలైన మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని ప్రముఖలను టార్గెట్ చేస్తూ ఈ మోసానికి పాల్పడ్డాడు నిందితుడు. మహిళలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు..జుంబా డాన్స్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్న నిర్వాహకులను అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించారు.