దోస్త్‌-2020 షెడ్యూల్ రెడీ..!

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 15 లేదా 16వ తేదీన షెడ్యూల్‌ విడుదల కానున్నది.

దోస్త్‌-2020 షెడ్యూల్ రెడీ..!
Follow us

|

Updated on: Jun 12, 2020 | 4:34 PM

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 15 లేదా 16వ తేదీన షెడ్యూల్‌ విడుదల కానున్నది. ఈ మేరకు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌-2020) అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ ఫలితాలు ఈ నెల 15న విడుదల కానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ రూపొందించే పనిలో పడ్డారు అధికారులు. 2020-21 విద్యాసంవత్సరానికి జూలై, ఆగస్టులో దశవారీగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్ారు. డిగ్రీ ఆడ్మిషన్లను చేపట్టి ఆగస్టు 24 వరకు పూర్తిచేయనున్నారు. యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబర్‌ ఒకటి నుంచి, ద్వితీయ, తృతీయ సంవత్సరం తరగతులను ఆగస్టు ఒకటినుంచి ప్రారంభించాల్సి ఉంది. ఈ మేరకు షెడ్యూల్‌ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్ల నిర్వహణకు సీజీజీ సహకారం అందిస్తున్నది. విద్యార్థులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడం కోసం వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్ మీడియాను ఉపయోగించనున్నారు. ఇక కాలేజీలను ఎప్పుడు తెరుస్తారన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే స్ఫష్టత ఇవ్వనుంది.

అందాల తార శ్రియ కూతురిని చూశారా? ఎంత క్యూట్ గా ఉందో..
అందాల తార శ్రియ కూతురిని చూశారా? ఎంత క్యూట్ గా ఉందో..
ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్
ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్
మీ ఇంట్లో వేడిగా ఉంటోందా? ఫ్యాన్‌, కూలర్‌ లేకుండానే ఇల్లంతా కూల్‌
మీ ఇంట్లో వేడిగా ఉంటోందా? ఫ్యాన్‌, కూలర్‌ లేకుండానే ఇల్లంతా కూల్‌
అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..
అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..
పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన
పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన
ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే అమృతమే..
ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే అమృతమే..
వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు
వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు
హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..
దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?
దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?