మండలి రద్దుపై చంద్రబాబు ఫైర్!

అసెంబ్లీలో వైసిపి ప్రభుత్వం డ్రామాలు ఆడింది.. సభలో ఓటింగ్ లెక్కించడం కూడా ఓ డ్రామా అని చంద్రబాబు ఆరోపించారు. వైసిపి ఎమ్మెల్యేలు ఓ నేరస్థుల ముఠా.. నేరస్థుల ముఠాను మేధావులతో పోల్చుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీలో డ్రామాలాడి తీర్మానం చేశారు. . మండలి రద్దుకు అసమ్మతి తీర్మానం దురదృష్టకరమని చంద్రబాబు పేర్కొన్నారు. సెలక్ట్ కమిటీకి పంపారన్న ఆక్రోషంతో మండలిని రద్దు చేశారు. ఉన్నత ఆశయాలతో ఏర్పడిన మండలిని రద్దు చేయడం సరికాదన్నారు. రాజ్యాంగ రూపకర్తలు ఎంతో ముందుచూపుతో…రెండు […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:08 pm, Mon, 27 January 20
మండలి రద్దుపై చంద్రబాబు ఫైర్!

అసెంబ్లీలో వైసిపి ప్రభుత్వం డ్రామాలు ఆడింది.. సభలో ఓటింగ్ లెక్కించడం కూడా ఓ డ్రామా అని చంద్రబాబు ఆరోపించారు. వైసిపి ఎమ్మెల్యేలు ఓ నేరస్థుల ముఠా.. నేరస్థుల ముఠాను మేధావులతో పోల్చుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీలో డ్రామాలాడి తీర్మానం చేశారు. . మండలి రద్దుకు అసమ్మతి తీర్మానం దురదృష్టకరమని చంద్రబాబు పేర్కొన్నారు. సెలక్ట్ కమిటీకి పంపారన్న ఆక్రోషంతో మండలిని రద్దు చేశారు. ఉన్నత ఆశయాలతో ఏర్పడిన మండలిని రద్దు చేయడం సరికాదన్నారు. రాజ్యాంగ రూపకర్తలు ఎంతో ముందుచూపుతో…రెండు సభల ఏర్పాటుకు అవకాశం కల్పించారని చంద్రబాబు పేర్కొన్నారు. మండలిలో టీడీపీ చేసిన తప్పేంటి? మండలికి రూ. 60 కోట్లు ఖర్చు అవుతుందన్న జగన్ తాను హైకోర్టుకు వెళ్ళడానికి మాత్రం రూ. 30 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని చంద్రబాబు తీవ్రంగా దుయ్యబట్టారు.