‘నదుల్లో స్నానాలు.. వీధుల్లో క్రికెట్..’: బెంగాల్ పై కేంద్రం ఫైర్..!

| Edited By:

May 07, 2020 | 4:26 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకి రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. అయితే పశ్చిమ బెంగాల్‌లో అడుగడుగునా లాక్‌డౌన్ నిబంధనల

నదుల్లో స్నానాలు.. వీధుల్లో క్రికెట్..: బెంగాల్ పై కేంద్రం ఫైర్..!
Follow us on

Centre raps West Bengal: కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకి రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. అయితే పశ్చిమ బెంగాల్‌లో అడుగడుగునా లాక్‌డౌన్ నిబంధనల అతిక్రమణ జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్రం ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా అవసరమైన స్థాయిలో చేయడం లేదని, కలకత్తా, జల్‌పైగురి జిల్లాల్లో పర్యటించిన తమ బృందాలు ఈ విషయాన్ని తెలియజేశాయని, ఆధారాలను కూడా సంపాదించాయని పేర్కొంది.

మరోవైపు.. జనాభా నిష్పత్తితో పోల్చితే కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా బెంగాల్ అత్యల్పంగా చేస్తోందని, మిగతా రాష్ట్రాలకంటే బెంగాల్‌లోనే కరోనా మరణాల శాతం కూడా అత్యధికంగా 13.2శాతం ఉందని కేంద్రం తెలిపింది. దీనిని బట్టి చూస్తే కరోనా నియంత్రణలో రాష్ట్రం పూర్తిగా విఫలమైనట్లు స్పష్టమవుతోందని పేర్కొంది. ‘మాస్కులు కూడా ధరించకుండా ప్రజలు గుంపులుగుంపులుగా వీధుల్లో తిరుగుతున్నారు. నదుల్లో కలిసిమెలిసి స్నానాలు చేస్తున్నారు. ఎటువంటి భయమూ లేకుండా ఖాళీ ప్రాంతాల్లో క్రికెట్, ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు.

కాగా.. ఎక్కడా తగినంత స్థాయిలో శానిటైజేషన్ జరగడం లేదు. కనీసం కరోనా కంటైన్మెంట్ జోన్లలో కూడా లాక్‌డౌన్ నిబంధనలను ప్రజలు పాటించడం లేదు. ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. రిక్షాలు, ఆటోలు డ్రైవర్లు యథేచ్ఛగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు ఎక్కడా అమలు జరగడం లేదంటూ కేంద్రం బెంగాల్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది.