కేంద్రం కీలక నిర్ణయం.. బ్రహ్మపుత్ర కింద భారీ సొరంగం..
గాల్వన్ ఘర్షణల క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నది కింద వ్యూహాత్మకంగా కీలకమైన టన్నెల్ (సొరంగం) నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

గాల్వన్ ఘర్షణల క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నది కింద వ్యూహాత్మకంగా కీలకమైన టన్నెల్ (సొరంగం) నిర్మాణానికి ఆమోదం తెలిపింది. నాలుగు లేన్లు ఉండే ఈ టన్నెల్.. అసోంలోని గోహ్‌పుర్, నుమాలీగఢ్‌లను కలుపుతుంది. అండర్ వాటర్ టన్నెల్‌ను భారత్ నిర్మించడం ఇదే తొలిసారి. జియాన్షు ప్రావిన్స్‌లో తైహు సరస్సు అడుగున చైనా నిర్మిస్తున్న సొరంగం (10.79 కిలోమీటర్లు) కంటే ఇది పెద్దది కావడం విశేషం.
దీని వల్ల అరుణాచల్ ప్రదేశ్, అసోం మధ్య ఏడాది పొడవునా కనెక్టివిటీ ఉంటుంది. మిలిటరీ సామగ్రి, ఆయుధాలను వేగంగా తరలించేందుకూ వీలవుతుంది. సొరంగం ద్వారా వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంది. 14.85 కిలోమీటర్ల పొడవుండే ఈ సొరంగ నిర్మాణాన్ని డిసెంబర్‌లో మొదలుపెట్టనున్నారు.
Also Read: విట్, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీల బీటెక్ ప్రవేశపరీక్షలు రద్దు..!