ఆ రెండు శాఖలను కలుపుతూ.. కేంద్రం కొత్త నిర్ణయం

మోదీ నేతృత్వంలో రెండోసారి అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం.. కొన్ని శాఖల్లో మార్పులు చేర్పులు చేసింది. జలవనరులు, తాగునీటికి సంబంధించిన రెండు మంత్రిత్వ శాఖలను కలుపుతూ జల్ శక్తి మంత్రిత్వ శాఖగా మార్చేసింది. కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గజేంద్ర షెఖావత్‌కు ఈ మంత్రిత్వ శాఖను అప్పగించారు. ఇకపై జలవ్యవహారాలన్నీ ఈ శాఖ కిందికే రానున్నాయి. అంతర్జాతీయ జల వివాదాలైనా, దేశీయ జలవివాదాలైనా ఈ శాఖే చూడాల్సి ఉంటుంది. అలాగే నీటి పారుదల రంగం, నమామి గంగ […]

ఆ రెండు శాఖలను కలుపుతూ.. కేంద్రం కొత్త నిర్ణయం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jun 01, 2019 | 11:50 AM

మోదీ నేతృత్వంలో రెండోసారి అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం.. కొన్ని శాఖల్లో మార్పులు చేర్పులు చేసింది. జలవనరులు, తాగునీటికి సంబంధించిన రెండు మంత్రిత్వ శాఖలను కలుపుతూ జల్ శక్తి మంత్రిత్వ శాఖగా మార్చేసింది. కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గజేంద్ర షెఖావత్‌కు ఈ మంత్రిత్వ శాఖను అప్పగించారు. ఇకపై జలవ్యవహారాలన్నీ ఈ శాఖ కిందికే రానున్నాయి. అంతర్జాతీయ జల వివాదాలైనా, దేశీయ జలవివాదాలైనా ఈ శాఖే చూడాల్సి ఉంటుంది. అలాగే నీటి పారుదల రంగం, నమామి గంగ ప్రాజెక్ట్, నీటి సరఫరా తదితరాలు కూడా ఈ శాఖ కిందికే రానున్నాయి. కాగా జల్‌శక్తి కింద నదుల అనుసంధానం, తుంపర సేద్యం అమలు, ప్రతి ఇంటికి నల్లా నీరు వంటివి అమలు చేస్తామంటూ ఎన్నికలకు ముందు బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న విషయం తెలిసిందే.