కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి కేంద్రం సన్నాహాలు.. ఈనెల 28,29 తేదీల్లో నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్‌

|

Dec 25, 2020 | 4:50 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తరిమికొట్టేందుకు ఔషధ కంపెనీల ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కోసం కేంద్రం సన్నాహాలు మొదలుపెట్టింది. ముందస్తుగా నాలుగురాష్ట్రాల్లో దీనికి సంబంధించి ముందుగా డ్రైరన్‌ నిర్వహించాలని నిర్ణయించింది.

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి కేంద్రం సన్నాహాలు.. ఈనెల 28,29 తేదీల్లో నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్‌
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తరిమికొట్టేందుకు ఔషధ కంపెనీల ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కోసం కేంద్రం సన్నాహాలు మొదలుపెట్టింది. ముందస్తుగా నాలుగురాష్ట్రాల్లో దీనికి సంబంధించి ముందుగా డ్రైరన్‌ నిర్వహించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఈనెల 28,29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా పంజాబ్‌, గుజరాత్‌, అసోం రాష్ట్రాల్లో డ్రైరన్‌ నిర్వహించనున్నారు. ఒక్కో రాష్ట్రంలో రెండు జిల్లాల్లో ఫైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వ్యాక్సిన్‌ పంపిణీలో సమస్యలు గుర్తించేందుకు డ్రైరన్‌ను నిర్వహిస్తున్నారు.

వ్యాక్సిన్‌ పంపిణీ అనేది చాలా సవాళ్లతో కూడుకున్న పంపిణీ.. అందుకే వ్యాక్సినేషన్‌లో కీలక భాగస్వాములైప వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు డ్రైరన్‌ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమిస్తోంది. మెడికల్‌ ఆఫీసర్లు , వ్యాక్సినేటర్లు , కోల్డ్‌చైన్‌ నిర్వాహకులు, సూపరవైజర్లు , డేటా మేనేజర్లు, ఆశా కోఆర్డినేటర్లతో పాటు వ్యాక్సిన్‌ పంపిణీలో భాగస్వాములైన వాళ్లందరని శిక్షణ కార్యక్రమాన్ని డ్రైరన్‌లో ఇవ్వనున్నారు.

వ్యాక్సిన్‌ పంపిణీ కోసం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,360 మంది అధికారులకు శిక్షణ ఇచ్చారు. త్వరలో ఏడువేల మందికి శిక్షణ ఇవ్వబోతున్నారు. వ్యాక్సిన్‌ ఎవరికి ఇవ్వాలి ? ఎలా ఇవ్వాలి ? వ్యాక్సన్‌ను ఎలా స్టోర్‌ చేయాలన్న విషయంపై డ్రైరన్‌లో ప్రధానంగా దృష్టిపెడతారు. వ్యాక్సిన్‌ తీసుకోవడానికి వచ్చే జనాన్ని ఎలా నియంత్రించాలన్న విషయంపై కూడా శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా భౌతికదూరంపై ప్రధానంగా దృష్టి పెడతారు.

ఒకవేళ వ్యాక్సిన్‌ వికటిస్తే ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై కూడా డ్రైరన్‌లో భాగంగా ప్రత్యేక శిక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంపై కూడా అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. బ్లాక్‌ , డిస్ట్రిక్‌ లెవెల్‌ నుంచి సమాచారం కేంద్ర ఆరోగ్యశాఖకు చేరుతుంది. తద్వారా కరోనా వ్యాక్సినేషన్ సంబంధించి సమాచారం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చేరనుంది. అదనంగా వ్యాధి వ్యాప్తిని నివారించడానికి, సెషన్ సైట్ వద్ద సంక్రమణ నియంత్రణ పద్ధతులపై విశ్లేషించనున్నారు. వివరణాత్మక చెక్‌లిస్ట్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తయారు చేసింది. వ్యాక్సినేషన్ లో భాగంగా నాలుగు రాష్ట్రాలతో మార్గనిర్దేశం చేస్తోంది.

భారతదేశంలో ఎనిమిది కోవిడ్ -19 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మూడు స్వదేశీ వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్ వివిధ దశలలో పూర్తి చేసుకుని ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. ఇందులో ఆస్ట్రాజెనెకా మరియు ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది కాగా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్, భారత్ బయోటెక్ లిమిటెడ్ తయారు చేసిన కోవాక్సిన్, జైడస్ కాడిలా వారి జైకోవ్-డి, అటు రష్యన్ వ్యాక్సిన్ అయిన స్పుత్నిక్-వి అందుబాటులో ఉన్నాయి.

దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సిన్‌ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. టీకా ప్రక్రియలో టీకా నిర్వాహకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి, వ్యాక్సిన్‌ను అందించే వారికి ప్రత్యేక శిక్షణను వివిధ రాష్ట్రాలలో చేపట్టారు. 681 జిల్లాల్లో 49,604 మంది ట్రైనీలకు కార్యాచరణ మార్గదర్శకాలపై వైద్య అధికారుల శిక్షణను పూర్తి చేశారు. 17,831 బ్లాక్స్, ప్లానింగ్ యూనిట్లలో 1,399 లో టీకా బృందాలకు శిక్షణలు పూర్తయ్యాయి.

అయితే, కరోనా వ్యాక్సిన్‌ను ముందస్తుగా సుమారు కోటి మంది హెల్త్‌కేర్ వర్కర్స్ , కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్స్, 27 కోట్ల మంది ప్రియారిటైజ్డ్ ఏజ్ గ్రూప్ సహా మూడు ప్రాధాన్యత కలిగిన జనాభా సమూహాలను కోవిడ్ -19 నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ సిఫారసు చేసిన వారికి వ్యాకిన్ వేయనున్నారు. కోవిడ్-19 టీకా, కో-విన్ పోర్టల్ సంబంధిత అనుమానాలను నివృత్తి చేసేందుు జాతీయ స్థాయిలో1075, రాష్ట్రంలో104 హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం.

టీకాలు ఉష్ణోగ్రత సున్నితమైన, నిర్దిష్ట ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సిన అవసరం ఉన్నందున, దేశవ్యాప్తంగా 28,947 కోల్డ్ చైన్ పాయింట్ల ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వ్యాక్సిన్ నిల్వ చేయడానికి 85,634 పరికరాలను కలిగి ఉన్న ప్రస్తుత కోల్డ్ చైన్ వ్యవస్థ కోల్డ్ చైన్ ఉపయోగించనున్నారు.