బాక్సింగ్ డే టెస్టు: టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రాహుల్‌కు మరోసారి నిరాశే..
India Vs Australia 2020: అనుకున్నట్లుగానే జరిగింది. బాక్సింగ్ డే టెస్టుకు ఒక రోజు ముందుగానే టీమిండియా తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది.

India Vs Australia 2020: అనుకున్నట్లుగానే జరిగింది. బాక్సింగ్ డే టెస్టుకు ఒక రోజు ముందుగానే టీమిండియా తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. సంచలనాలు ఏవి లేవు గానీ.. తొలి టెస్టులో విఫలమైన పృథ్వీ షా, వికెట్ కీపర్ సాహాలను తొలిగించి వారి స్థానాల్లో శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఇక గాయపడిన పేసర్ మహమ్మద్ షమీ స్థానంలో సిరాజ్ ఎంపికయ్యాడు. అటు కేఎల్ రాహుల్‌కు మరోసారి నిరాశే మిగిలింది.
అలాగే స్పిన్ విభాగాన్ని బలపరుస్తూ అశ్విన్‌కు తోడుగా రవీంద్ర జడేజా ఫైనల్ ఎలెవన్‌లోకి తీసుకున్నారు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో అజింక్య రహనే జట్టు సారధ్య బాధ్యతలను చేపట్టనున్నాడు.
కాగా, మయాంక్, గిల్ ఓపెనింగ్ చేయనుండగా.. వన్‌డౌన్‌లో పుజారా, ఆ తర్వాత రహనే, నెక్స్ట్ హనుమ విహారి మిడిల్ ఆర్డర్‌లో ఆడనున్నారు. ఇక స్పిన్ విభాగాన్ని అశ్విన్, జడేజాలు హ్యాండిల్ చేయనుండగా.. సిరాజ్, బుమ్రా, ఉమేష్ యాదవ్ పేస్ బౌలింగ్ భారం మోయనున్నారు. కాగా, నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌లో నిలవాలంటే బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి.
టీమిండియా జట్టు : అజింక్యా రహానే(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
Also Read:
Bigg Boss 4: మెహబూబ్ సైగలపై స్పందించిన అభిజిత్.. ‘స్టార్ మా’ తేల్చాలంటూ ఆసక్తికర కామెంట్స్.!
కేంద్రం కీలక నిర్ణయం.. జనవరి 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరి.!
ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం దుకాణాలు, బార్లపై నిషేధం లేదంటూ..!
షాకింగ్ న్యూస్: కరోనా లక్షణాలు లేవని ఆఫీస్‌కు వచ్చిన ఉద్యోగి.. ఏడుగురు మృతి, 300 మంది క్వారంటైన్.!




