చాంద్రాయణగుట్ట ప్రాంతంలో కేంద్ర బృందం పర్యటన

హైదరాబాద్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటిస్తుంది. చాంద్రాయణ గుట్ట ఫ‌ల‌క్‌నూమా వద్ద దెబ్బతిన్న ఆర్.ఓ.బి ని, ముంపుకు గురైన ప్రాంతాన్ని గురువారం కేంద్ర బృందం పరిశీలించింది.

చాంద్రాయణగుట్ట ప్రాంతంలో కేంద్ర బృందం పర్యటన
Follow us

|

Updated on: Oct 22, 2020 | 4:05 PM

హైదరాబాద్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటిస్తుంది. చాంద్రాయణ గుట్ట ఫ‌ల‌క్‌నూమా వద్ద దెబ్బతిన్న ఆర్.ఓ.బి ని, ముంపుకు గురైన ప్రాంతాన్ని గురువారం కేంద్ర బృందం పరిశీలించింది. వరద బాధిత ప్రజలతో మాట్లాడిన కేంద్ర బృందం టీం లీడర్ ప్రవీణ్ వశిష్ఠ, అధికారులు ఎం.రఘురామ్, ఎస్ కె కుష్వారా. ఆర్ ఓ బి.కి రెండు వైపుల చేప‌ట్టిన‌ పునరుద్దరణ, నాలా నుండి తొలగిస్తున్న పూడికతీత పనులను పరిశీలించారు.

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో త‌మ ఇళ్ల గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొద‌టి అంత‌స్తులోకి కూడా నీళ్లు వ‌చ్చిన‌ట్లు ఈ ప్రాంత ప్ర‌జ‌లు కేంద్ర క‌మిటికి వివ‌రించారు. ఇప్ప‌టికి రోడ్ల‌పై, ఇళ్ల‌లోనూ నీళ్లు పేరుకుపోయి ఉన్న‌ట్లు వివరించారు. 10 రోజుల పాటు నీళ్ల‌లో నాన‌డం వల్ల త‌మ ఇళ్ల గోడ‌లు దెబ్బ‌తిన్నాయ‌ని తెలిపారు.

కేంద్ర బృందంతో పాటు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌, చీఫ్ ఇంజ‌నీర్ జియాఉద్దీన్ లు పర్యటించారు. 40 సంవ‌త్స‌రాల క్రితం ఫ‌ల‌క్‌నూమా ఆర్‌.ఓ.బి ని నిర్మించిన‌ట్లు కేంద్ర బృందానికి తెలిపారు జీహెచ్ఎంసీ కమిషనర్. ఈ ఆర్‌.ఓ.బి వ‌ల‌న ఇన్న‌ర్ రింగ్‌రోడ్డు, చార్మినార్ ప్రాంతాల‌కు రోడ్డు స‌దుపాయం అనుసంధానం అయిన‌ట్లు వివరించారు. పల్లె చెరువు నుండి వ‌చ్చే వ‌ర‌ద నీటి నాలా 7 మీట‌ర్ల వెడ‌ల్పు ఉంటుంద‌ని, ఇది ఆర్‌.ఓ.బి కింద నుండి వెళ్తుంద‌ని తెలిపారు. ప‌ల్లెచెరువు తెగిపోవ‌డం వ‌ల‌న వ‌చ్చిన వ‌ర‌ద‌తో ఈ ప్రాంతానికి అపార న‌ష్టం జ‌రిగిన‌ట్లు కేంద్ర బృందానికి వివరించారు. భారీ వరదల ధాటికి రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జి ఆర్‌.ఓ.బి రిటైనింగ్ వాల్వ్ దెబ్బ‌తిన్న‌ద‌ని, అదేవిధంగా అనేక కాల‌నీలు వ‌ర‌ద ముంపుకు గురైన‌ట్లు తెలిపారు. దీంతో వందలాది మంది నిరాశ్రులయ్యారు. దాదాపు 30 మంది వరద ప్రవాహానికి గల్లతైనట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ వివరించారు.

వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం