AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రిటన్‌లో 40 డిగ్రీలకే కరుగుతున్న రోడ్లు.. భారత్‌లో ఎలా తట్టుకుంటున్నాయో తెలుసా?

ఇటీవల యూరప్, బ్రిటన్ (UK) దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కేవలం 40 డిగ్రీల సెల్సియస్ వేడికే అక్కడి రోడ్లు మెత్తబడి, కరిగిపోతున్న దృశ్యాలు సాషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన చాలామందికి ఒక అనుమానం వస్తోంది.. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎండలు 45 నుండి 50 డిగ్రీల వరకు నమోదవుతున్నా ఇక్కడి హైవేలు, రోడ్లు ఎందుకు కరగడం లేదు? బ్రిటన్ రోడ్ల కంటే భారతీయ రోడ్లు ఎక్కువ నాణ్యమైనవా? అంటే, అసలు కారణం నాణ్యత కాదు,

బ్రిటన్‌లో 40 డిగ్రీలకే కరుగుతున్న రోడ్లు.. భారత్‌లో ఎలా తట్టుకుంటున్నాయో తెలుసా?
Uk Roads Melting
Jyothi Gadda
|

Updated on: Jul 01, 2026 | 1:12 PM

Share

బ్రిటన్‌లో 40 డిగ్రీల వేడికే రోడ్లు కరిగిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్‌నెట్‌లో విస్తృతంగా వైరల్‌ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ దృశ్యాలు విస్తృతంగా షేర్‌ అవుతూ తీవ్ర చర్చకు దారితీశాయి. భారతదేశంలో వేసవిలో రోడ్లపై ఉష్ణోగ్రతలు తరచూ 45°C కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇలాంటి దృశ్యాలు అసాధారణం. బ్రిటన్ రోడ్ల కంటే భారతీయ రోడ్లు ఎక్కువ నాణ్యమైనవా? అంటే, అసలు కారణం నాణ్యత కాదు, క్లైమేట్ బేస్డ్ ఇంజనీరింగ్ అవును..వాతావరణ ఆధారిత సాంకేతికతే ఇందుకు కారణం.

బ్రిటన్ రోడ్లు ఎందుకు కరుగుతాయి?:

బ్రిటన్, ఇతర యూరప్ దేశాలు చారిత్రాత్మకంగా శీతల ప్రాంతాలు. అక్కడ చాలా కాలం పాటు మంచు కురుస్తుంది. ఉష్ణోగ్రతలు మైనస్‌లోకి పడిపోతాయి. అందువల్ల, అక్కడి రోడ్లను తీవ్రమైన చలిని తట్టుకునేలా డిజైన్ చేస్తారు. ఈ రోడ్ల నిర్మాణంలో హాట్ రోల్డ్ ఆస్ఫాల్ట్ (HRA), తక్కువ విస్కాసిటీ (సన్నని గ్రేడ్) కలిగిన సాఫ్ట్ బిటుమెన్ (తారు) ఉపయోగిస్తారు. ఈ సాఫ్ట్ బిటుమెన్ వల్ల చలికాలంలో రోడ్లు గడ్డకట్టి పగుళ్లు (cracks) రాకుండా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. కానీ, ఎప్పుడైనా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరినప్పుడు, ఆ వేడికి ఈ సాఫ్ట్ తారు సులభంగా కరిగిపోతుంది. భారీ వాహనాల ఒత్తిడికి రోడ్లు దెబ్బతింటాయి.

భారతదేశంలో రోడ్లు ఎలా తట్టుకుంటాయి?:

భారతదేశంలో వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ సంవత్సరంలో దాదాపు 4-5 నెలల పాటు తీవ్రమైన ఎండలు ఉంటాయి. అందువల్ల, భారతీయ రోడ్లను అధిక ఉష్ణోగ్రతలను, భారీ ట్రాఫిక్‌ను తట్టుకునేలా నిర్మిస్తారు. ఇక్కడి రోడ్ల నిర్మాణంలో విస్కోసిటీ-గ్రేడెడ్ బిటుమెన్ బైండర్స్ (VG-30, VG-40) వంటి హార్డ్ బిటుమెన్‌ను ఉపయోగిస్తారు. ఇది చాలా గట్టిగా, ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. దీంతో పాటు పెద్ద పరిమాణంలో ఉండే కంక్రీట్ రాళ్ల మిశ్రమాన్ని (Bituminous Concrete) వాడటం వల్ల ఎండ తీవ్రత 45 డిగ్రీలు దాటినా ఈ తారు అంత సులభంగా మెత్తబడదు.

ఇవి కూడా చదవండి

రోడ్లు నిర్మించేటప్పుడు ఏ దేశమైనా అక్కడ సాధారణంగా ఉండే వాతావరణ పరిస్థితులనే ప్రామాణికంగా తీసుకుంటుంది. బ్రిటన్ రోడ్లు చలిని తట్టుకోవడానికి, భారతీయ రోడ్లు వేడిని తట్టుకోవడానికి అనువుగా డిజైన్ చేయబడ్డాయి. అయితే, ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్ కారణంగా శీతల దేశాల్లో కూడా ఊహించని విధంగా ఎండలు మండుతుండటంతో, అక్కడి మౌలిక సదుపాయాలు ఈ మార్పులను తట్టుకోలేకపోతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us