AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips For Broom: ఈ రోజుల్లో చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులవ్వడం ఖాయం!

హిందూ సంప్రదాయంలో, వాస్తు శాస్త్రంలోనూ చీపురుకు (పొరక) అత్యంత ప్రాధాన్యత ఉంది. చీపురును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇంటిని శుభ్రంగా ఉంచే చీపురు మన ఆర్థిక స్థితిని, అదృష్టాన్ని కూడా మార్చగలదని వాస్తు నిపుణులు చెబుతుంటారు. అయితే, కొత్త చీపురును ఏ రోజు పడితే ఆ రోజు కొనకూడదు. వాస్తు ప్రకారం చీపురు కొనడానికి కొన్ని నిర్దిష్టమైన రోజులు, నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Vastu Tips For Broom: ఈ రోజుల్లో చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులవ్వడం ఖాయం!
Vastu Tips For Broom
Jyothi Gadda
|

Updated on: Jul 01, 2026 | 10:49 AM

Share

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని పొరక (చీపురు) కేవలం శుభ్రం చేయడానికి మాత్రమే కాదు, లక్ష్మీదేవి స్వరూపంగా, ఆర్థిక సమృద్ధికి చిహ్నంగా పరిగణించబడుతుంది. చీపురు కొనే విషయంలో కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. అలా చేస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, ఇంట్లో ధనవర్షం కురుస్తుందని నమ్ముతారు. అంతేకాదు.. ఉపయోగించిన తరువాత చీపురును ఇంట్లో సరైన దిశలో ఉంచడం వల్ల కూడా సానుకూల శక్తి పెరుగుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏ రోజుల్లో చీపురు కొనాలి?:

వాస్తు శాస్త్రం ప్రకారం, కొత్త చీపురు కొనడానికి మంగళవారం, శుక్రవారం అత్యంత అనుకూలమైన రోజులు. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో, ఈ రోజు చీపురు కొని ఇంటికి తెచ్చుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే మంగళవారం కొనుగోలు చేయడం వల్ల కూడా అదృష్టం కలిసి వస్తుంది. దీపావళి పండుగ రోజున చీపురు కొనడం మరింత శ్రేయస్కరంగా భావిస్తారు.

ఏ రోజుల్లో అస్సలు కొనకూడదు?:

సోమవారం రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు. ఈ రోజు కొనడం వల్ల వ్యాపారంలో నష్టాలు రావడం, అనవసరపు ఖర్చులు పెరగడం, అప్పుల పాలు అయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా శనివారం రోజున నూనె, ఇనుప వస్తువులు కొనరనే సంగతి తెలిసిందే. అదేవిధంగా శనివారం రోజు చీపురు కొనడం కూడా అశుభంగా పరిగణిస్తారు. దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్ముతారు. జ్యోతిష్యం ప్రకారం పంచక కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. ఈ అశుభ సమయంలో కూడా చీపురు కొనడం మంచిది కాదు.

ఇవి కూడా చదవండి

చీపురును ఏ దిశలో ఉంచాలి?:

ఇంట్లో సానుకూల శక్తి (పాజిటివ్ ఎనర్జీ) నిలిచి ఉండాలంటే చీపురును సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం, చీపురును ఎప్పుడూ ఇంటికి పశ్చిమ లేదా వాయువ్య (North-West) దిశలో ఉంచాలి. దీనివల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అయితే, పొరపాటున కూడా చీపురును ఇంటికి ఈశాన్యం (North-East) లేదా ఆగ్నేయం (South-East) దిశల్లో పెట్టకూడదు. ఇది వాస్తు దోషానికి దారితీస్తుంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కొన్ని పురాణాలు, ప్రాంతీయ ఆచారాలు, సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ప్రచారంలో ఉన్నవి. ఇవి శాస్త్రీయంగా లేదా అన్ని ఆగమ గ్రంథాల్లో ఏకరీతిగా పేర్కొనబడిన అంశాలు కావని గుర్తుంచుకోవాలి. భక్తులు తమ కుటుంబ సంప్రదాయం లేదా గురువుల సూచనలను అనుసరించడం ఉత్తమం.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!