దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా డాక్టర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా రోగులను నయం చేసేందుకు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం అలాంటివారికి సకాలంలో జీతాలు చెల్లించే విధంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతీ సూడాన్ అన్ని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. కరోనా వారియర్స్‌కు జీతాలు సమయానికి చెల్లించాలని సూచించారు. ఒకవేళ వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి జీతాలు సకాలంలో చెల్లించకపోతే విపత్తు నిర్వహణ చట్టం కింద ప్రైవేట్ ఆసుపత్రులు, సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖలో పేర్కొన్నారు.
Also Read:
ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు.!
జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి వయోపరిమితి పెంపు..!
దేశంలో మళ్లీ లాక్ డౌన్.. క్లారిటీ ఇచ్చిన ప్రధాని..
బ్రేకింగ్: ఐరాస భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ అద్భుత విజయం..