విమానయాన సంస్థలపై విధించిన కరోనా ఆంక్షలను మరింత సడలించిన కేంద్రం.. లక్షణాలు కనిపిస్తే పీపీఈ కిట్ల సమకూర్చాలని ఆదేశం

దేశంలో కరోనా రోజు రోజుకు తగ్గుముఖం పడుతోంది. దీంతో కోవిడ్ ఆంక్షలు ఒక్కటొక్కటిగా వీడిపోతున్నాయి. ఇందులో భాగంగా విమానయాన సంస్థలపై విధించిన ఆంక్షలను...

విమానయాన సంస్థలపై విధించిన కరోనా ఆంక్షలను మరింత సడలించిన కేంద్రం.. లక్షణాలు కనిపిస్తే పీపీఈ కిట్ల సమకూర్చాలని ఆదేశం

Updated on: Dec 21, 2020 | 12:41 AM

Corona Restrictions : దేశంలో కరోనా రోజు రోజుకు తగ్గుముఖం పడుతోంది. దీంతో కోవిడ్ ఆంక్షలు ఒక్కటొక్కటిగా వీడిపోతున్నాయి. ఇందులో భాగంగా విమానయాన సంస్థలపై విధించిన ఆంక్షలను మరింత సడలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

నాలుగు గంటల వ్యవధిలోపు ప్రయాణం పూర్తిచేసుకునే విమానాల్లో ఐసోలేషన్‌ జోన్‌ని ఏర్పాటుచేయాలన్న నిబంధనను ఎత్తివేసింది. ఈ నెల 16న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలలో క్వారంటైన్‌ కోసం కొన్ని సీట్లను ఖాళీగా విడిచిపెట్టాలన్న నిబంధనను సవరించింది.

నాలుగు గంటలకు మించిన ప్రయాణ వ్యవధి ఉన్న విమానాల్లో చివరి వరుసలోని కుడివైపునున్న సీట్లను క్వారంటైన్‌ కోసం రిజర్వు చేయాలని ఆదేశాల్లో వెల్లడించింది. విమానంలో ఉన్న సమయంలో కరోనా లక్షణాలు వృద్ధి చెందితే.. వారికోసం అవసరమైన పీపీఈ కిట్లను విమానయాన సంస్థలు సమకూర్చాలని పేర్కొంది.