ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.7 లక్షలలోపు ఆదాయం ఉంటే.?

|

Jan 26, 2020 | 11:36 AM

Good News To Employees: ప్రస్తుతం భారత్‌ను పట్టి పీడిస్తున్న సమస్య ఆర్ధిక మాంద్యం. దీని వల్ల చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కంపెనీలు అయితే ఏకంగా మూతపడిపోయాయి. ఇక ఈ సమస్యకు మోదీ సర్కార్ విరుగుడు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే ఆర్ధిక బడ్జెట్‌లో ఉద్యోగులకు […]

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.7 లక్షలలోపు ఆదాయం ఉంటే.?
Follow us on

Good News To Employees: ప్రస్తుతం భారత్‌ను పట్టి పీడిస్తున్న సమస్య ఆర్ధిక మాంద్యం. దీని వల్ల చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కంపెనీలు అయితే ఏకంగా మూతపడిపోయాయి. ఇక ఈ సమస్యకు మోదీ సర్కార్ విరుగుడు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే ఆర్ధిక బడ్జెట్‌లో ఉద్యోగులకు పలు వరాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే రూ.7 లక్షల వరకూ ఆదాయపు పన్ను పరిమితిని 5 శాతానికే ప్రతిపాదించడానికి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక గత ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన మధ్యంతర బడ్జెట్‌లో రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అటు వార్షిక ఆదాయాల పన్నుల శ్లాబులలో కూడా పలు మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

రూ.5-7 లక్షల ఆదాయం ఉన్నవారికి 5 శాతం, ఇక రూ.7- 10 లక్షల దాకా 10 శాతం, 10-20 లక్షలు వార్షిక ఆదాయానికి 20 శాతం.. అలాగే రూ20లక్షల- 10 కోట్లు మధ్య ఆదాయం ఉంటే 30 శాతం పన్నును ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఒకవేళ ఇదే గనక జరిగితే వేతన జీవులకు పెద్ద ఊరట లభించే అవకాశం ఉంది.