AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cement Demand: వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెరగనున్న సిమెంట్‌ అమ్మకాలు.. కారణమేంటో తెలుసా..?

Cement Demand Grow in 2021-22: కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితమైన రంగాల్లో నిర్మాణ రంగం ఒకటి. లాక్‌ డౌన్‌ సమయంలో ఆదాయాలు భారీగా పడిపోవడంతో నిర్మాణాలపై..

Cement Demand: వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెరగనున్న సిమెంట్‌ అమ్మకాలు.. కారణమేంటో తెలుసా..?
Narender Vaitla
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Jan 14, 2021 | 7:38 AM

Share

Cement Demand Grow in 2021-22: కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితమైన రంగాల్లో నిర్మాణ రంగం ఒకటి. లాక్‌ డౌన్‌ సమయంలో ఆదాయాలు భారీగా పడిపోవడంతో నిర్మాణాలపై పెద్దగా ఆసక్తికనబర్చలేరు. దీంతో కొత్త నిర్మాణాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. ఈ కారణంగా సిమెంట్‌ అమ్మకాలు కూడా పడిపోయాయి. అయితే తాజాగా మళ్లీ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోన్న నేపథ్యంలో సిమెంట్‌ అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో సిమెంట్‌ అమ్మాకాలు భారీగా పుంజుకోనున్నాయని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. వచ్చే ఏడాదిలో పరిశ్రమలో 18 నుంచి 20 శాతం సిమెంట్‌కు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పెరుగుతోన్న డిమాండ్‌తో పాటు మౌలిక రంగం తిరిగి గాడిన పడనుండడం ఈ పెరుగుదలకు కారణని ఇక్రా భావిస్తోంది. ఇక ఇదే విషయమై ఇక్రా ఏవీపీ అనుపమ రెడ్డి మాట్లాడుతూ.. ‘సకాలంలో రబీ నాట్లు పడడం, నీటి నిల్వలు పుష్కలంగా ఉండడంతో ఉత్పదకత మెరుగై.. గ్రామీణ ప్రాంతాల నుంచి సిమెంటుకు డిమాండ్‌ ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.

Also Read: Vehicle Sales Increased: కరోనా సీజన్‌లోనూ పెరిగిన వాహనాల విక్రయాలు.. యూనిట్ల వివరాలు వెల్లడించిన ఫాడా