రూ.800 కోట్ల బ్యాంకు రుణాలు ఎగ‌వేసిన కంపెనీపై.. సీబీఐ దాడులు!

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఢిల్లీ, గురుగ్రాం, పంచకుల, చండీగఢ్‌లలోని యాంబియన్స్ గ్రూపు కంపెనీ ఆఫీసులు, ఇళ్లపై సీబీఐ ఏకకాలంలో దాడులు చేసింది. రూ.800 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో యాంబియన్స్ గ్రూపుపై ఈడీ కేసులు నమోదు చేసింది.

  • Tv9 Telugu
  • Publish Date - 7:24 pm, Mon, 10 August 20
రూ.800 కోట్ల బ్యాంకు రుణాలు ఎగ‌వేసిన కంపెనీపై.. సీబీఐ దాడులు!

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఢిల్లీ, గురుగ్రాం, పంచకుల, చండీగఢ్‌లలోని యాంబియన్స్ గ్రూపు కంపెనీ ఆఫీసులు, ఇళ్లపై సీబీఐ ఏకకాలంలో దాడులు చేసింది. రూ.800 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో యాంబియన్స్ గ్రూపుపై ఈడీ కేసులు నమోదు చేసింది. గురుగ్రాంలోని యాంబియన్స్ మాల్ నిర్మాణం విషయంలో అక్రమాలపై కూడా కేసులు నమోదు చేసింది. నివాస స్థలాన్ని వాణిజ్య స్థలంగా మార్చడంపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని హైకోర్ట్ ఆదేశించిన విషయం విదితమే.

జూలై 31 న, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఢిల్లీలోని ఏడు ప్రదేశాలలో శోధనలు చేసింది, వీటిలో యాంబియన్స్ గ్రూపు అధినేతగా ఉన్న రాజ్ సింగ్ గెహ్లోత్ యొక్క నివాస ప్రాంగణం, అమన్ హాస్పిటాలిటీ యొక్క అధికారిక ప్రాంగణం, అంబియెన్స్ గ్రూప్ యొక్క ఇతర సంస్థలు ఉన్నాయి. హైకోర్ట్ ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా, యాంబియన్స్ గ్రూపు అధినేతగా ఉన్న రాజ్ సింగ్ గెహ్లోత్.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్‌తో సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ విషయమై కూడా సీబీఐ విచారణ జరుపుతోంది.

Read More:

గుడ్ న్యూస్: తెలంగాణ ఆస్పత్రుల్లో ఇక ఆర్‌టీ-పీసీఆర్‌ ద్వారా కరోనా టెస్ట్..!

తెలంగాణలో కొలువుల జాతర.. కార్మిక ఉపాధి కల్పన శాఖ కొత్త ప్లాన్‌..!