Bunny Vasu: బన్నీ వాసును పరామర్శించిన నటుడు అల్లు అర్జున్.. వెంట వచ్చిన శిరీష్, డైరెక్టర్ సుకుమార్..
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసును నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బన్నీ వాసు సోదరుడు...

Bunny Vasu Brother Death: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసును నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బన్నీ వాసు సోదరుడు గవర సురేష్ ఇటీవల కిడ్నీలు ఫెయిలవ్వడంతో బెంగుళూరులోని ప్రైవేటు ఆసుప్రతిలో డిసెంబర్ 11న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీనితో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వెళ్లిన అల్లు అర్జున్.. బన్నీ వాసును కలిసి ధైర్యాన్ని చెప్పారు. బన్నీ వాసుతో పాటు ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. బన్నీతో పాటు శిరీష్, డైరెక్టర్ సుకుమార్‌లు కూడా ప్రత్యేక చార్టడ్ ఫ్లైట్‌లో పాలకొల్లు వెళ్లి బన్నీవాసును పరామర్శించారు. కాగా, అల్లు అర్జున్ సినిమాలు ‘సరైనోడు’, ‘నా పేరు సూర్య’ సినిమాలకు బన్నీ వాసు సహా నిర్మాతగా వ్యవహరించిన విషయం విదితమే.
Also Read:




