బిగ్ బాస్ 4: దేత్త‌డి పాప సేఫ్.. మోనాల్ ఎలిమినేట్.! రసవత్తరంగా మారనున్న ఫినాలే పోటీ.. టాప్ 2లో ఎవరుంటారో.?

బిగ్ బాస్ నాలుగో సీజన్ మరో వారం రోజుల్లో పూర్తి కానుంది. ట్రోఫీ కోసం వైల్డ్ కార్డు ఎంట్రీలతో కలిపి మొత్తం 19 సభ్యులు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ కాగా..

బిగ్ బాస్ 4: దేత్త‌డి పాప సేఫ్.. మోనాల్ ఎలిమినేట్.! రసవత్తరంగా మారనున్న ఫినాలే పోటీ.. టాప్ 2లో ఎవరుంటారో.?
Follow us

|

Updated on: Dec 13, 2020 | 1:27 PM

Bigg Boss 4: బిగ్ బాస్ నాలుగో సీజన్ మరో వారం రోజుల్లో పూర్తి కానుంది. ట్రోఫీ కోసం వైల్డ్ కార్డు ఎంట్రీలతో కలిపి మొత్తం 19 సభ్యులు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ కాగా.. చివరికి ఆరుగురు మాత్రమే మిగిలారు. ఈ వారం అభిజిత్, మోనాల్, హారిక, అరియానా, సోహైల్‌లు ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హోస్టు అక్కినేని నాగార్జున ఫినాలేలో చోటు దక్కించుకున్న టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరన్న సస్పెన్స్‌కు తెరదించారు. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో అఖిల్‌తో పాటు.. అతడి కోసం మెడల్ త్యాగం చేసిన సోహైల్ టాప్5‌లోకి రెండో కంటెస్టెంట్‌గా చేరుకున్నాడని ప్రకటించాడు.

అలాగే అభిజిత్ మూడో కంటెస్టెంట్‌గా, అరియనా నాలుగో స్థానంలో టాప్5‌లోకి చేరుకున్నట్లు సమాచారం. ఈ వారం ఎలిమినేషన్స్‌లో దేత్తడి హారిక, గుజరాతీ భామ  మోనాల్ గజ్జర్ డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అందరి కన్నా మోనాల్‌కు అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైనట్లు సమాచారం. దీనితో చివరి వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి మోనాల్ గజ్జర్ బయటికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, గత కొద్దివారాలుగా ఈ భామ ఎలిమినేష‌న్ అంచుల వ‌ర‌కు వెళ్లి బ‌య‌ట ప‌డ్డ సంద‌ర్భాలు కోకొల్ల‌లు. కొన్నిసార్లు అయితే బిగ్ బాస్ ఆమెను కాపాడేందుకు కుమార్ సాయి, అవినాష్, దేవి నాగవల్లి లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేశాడన్న ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి.

మొత్తం మీద హౌస్‌లోకి ఎంటర్ అయిన తొలినాళ్లలో అభిజిత్-అఖిల్ మధ్య నలిగిపోయిన మోనాల్.. ఆ తర్వాత తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేసింది. హారిక కెప్టెన్ కావడానికి తనవంతు సాయం చేసింది. ఇక చివరికి ఒకపక్క బాధలు, మరోపక్క అపనిందలతో ఈవారం బిగ్ బాస్ హౌస్‌కు వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమైంది.