ఈ చిత్రం చూశారా!..అతని కడుపులో 116 మేకులు..ఒక వైర్

బుందీ: రాజస్థాన్‌లోని బుందీలో ప్రభుత్వ వైద్యులు ఒక అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఒక వ్యక్తి కడుపులో ఉన్న 116 మేకులను, ఒక వైర్‌ను బయటకి తీశారు. వివరాల్లోకి వెళ్తే.. తీవ్రమైన కడుపునొప్పి వస్తోందని భోలా శంకర్‌(42) అనే వ్యక్తి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించారు. అతనికి స్కానింగ్‌ చేసిన అనంతరం కడుపులో ఏదో వస్తువులు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. దీంతో సీటీ స్కాన్‌కు సిఫారసు చేయగా అతని కడుపులో మేకులు ఉన్నట్లు వైద్యులు నిర్ధారణకు వచ్చారు. సోమవారం […]

  • Ram Naramaneni
  • Publish Date - 7:50 pm, Tue, 14 May 19
ఈ చిత్రం చూశారా!..అతని కడుపులో 116 మేకులు..ఒక వైర్

బుందీ: రాజస్థాన్‌లోని బుందీలో ప్రభుత్వ వైద్యులు ఒక అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఒక వ్యక్తి కడుపులో ఉన్న 116 మేకులను, ఒక వైర్‌ను బయటకి తీశారు. వివరాల్లోకి వెళ్తే.. తీవ్రమైన కడుపునొప్పి వస్తోందని భోలా శంకర్‌(42) అనే వ్యక్తి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించారు. అతనికి స్కానింగ్‌ చేసిన అనంతరం కడుపులో ఏదో వస్తువులు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. దీంతో సీటీ స్కాన్‌కు సిఫారసు చేయగా అతని కడుపులో మేకులు ఉన్నట్లు వైద్యులు నిర్ధారణకు వచ్చారు. సోమవారం గంటన్నర పాటు శ్రమించిన వైద్యులు 6.5 సెంటీమీటర్లు పొడవున్న 116 మేకులను అతని కడుపులోంచి బయటకు తీశారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆ మేకులు పేగుల్లోకి వెళ్లి ఉంటే అతను బతకడం అసాధ్యమని వైద్యులు అంటున్నారు. కాని అన్ని మేకులు ఎందుకు మింగాడో అతను గాని, కుటుంబ సభ్యులు గాని చెప్పడం లేదన్నారు. సదరు వ్యక్తి మానసికంగా కాస్త ఎదుగుదల లేకపోవడంతోనే ఇలా అయి ఉండవచ్చని వైద్యలు అభిప్రాయపడుతున్నారు.