AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ గాయం : బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

ప్రేమ పేరుతో మోసపోయిన ఓ బీటెక్ స్టూడెంట్‌ సూసైడ్ చేసుకున్నాడు. చివరిగా సెల్ఫీ వీడియో ద్వారా తన బాధను పంచుకున్నాడు.

ప్రేమ గాయం : బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య
Ram Naramaneni
|

Updated on: Sep 13, 2020 | 7:38 PM

Share

ప్రేమ పేరుతో మోసపోయిన ఓ బీటెక్ స్టూడెంట్‌ సూసైడ్ చేసుకున్నాడు. చివరిగా సెల్ఫీ వీడియో ద్వారా తన బాధను పంచుకున్నాడు.  ఎవర్నీ ప్రేమించకండి, చచ్చేదాకా మనతో ఎవరుంటారో వారినే ప్రేమించండి అని‌ చెప్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

వివరాల్లోకెళ్తే.. కరీంనగర్‌ జిల్లా సప్తగిరికాలనీకి చెందిన ఇంజనీరింగ్‌ స్టూడెంట్ సాయి మూడు రోజుల క్రితం సెల్ఫీ వీడియో తీసుకుంటూ క్రిమిసంహారక మందు తాగాడు. వెంటనే స్థానికులు గుర్తించి అతన్ని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ రోజు చనిపోయాడు. అయితే  ఓ అమ్మాయిని ఘాడంగా ప్రేమించిన సాయి.. ఆమెతో విబేధాలు రావడంతోనే సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.‌ చనిపోయాక అతని సెల్ ఫోన్‌లో ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో బయటపడడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

Also Read :

దొంగతనానికి వచ్చి, గురకపెట్టి నిద్రపోయాడు

బైక్‌ల చోరీలు : వీళ్ల రూటే సెపరేట్ !