50 కోట్లిస్తే మోదీని లేపేస్తా – తేజ్ బహదూర్ నాటి మాట.!

| Edited By: Srinu

May 07, 2019 | 5:52 PM

ప్రధాని నరేంద్ర మోదీకి పోటీగా వారణాసి నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా మాజీ బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడి దరఖాస్తును ఈసీ తిరస్కరించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆయనకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు పెను సంచలనమైంది. తనకు రూ.50 కోట్లు ఇస్తే ప్రధాని నరేంద్రమోదీని చంపేస్తానని బహదూర్ అందులో పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలు రెండేళ్ల క్రితం స్నేహితుడితో కలిసి మాట్లాడిన సందర్భంలోని వని […]

50 కోట్లిస్తే మోదీని లేపేస్తా - తేజ్ బహదూర్ నాటి మాట.!
Follow us on

ప్రధాని నరేంద్ర మోదీకి పోటీగా వారణాసి నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా మాజీ బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడి దరఖాస్తును ఈసీ తిరస్కరించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆయనకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు పెను సంచలనమైంది. తనకు రూ.50 కోట్లు ఇస్తే ప్రధాని నరేంద్రమోదీని చంపేస్తానని బహదూర్ అందులో పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలు రెండేళ్ల క్రితం స్నేహితుడితో కలిసి మాట్లాడిన సందర్భంలోని వని  తెలుస్తోంది. ఈ వీడియోలో ఉన్నది తానేనని తేజ్ బహదూర్ కూడా అంగీకరించాడు. అయితే, దీని వెనక కుట్ర ఉందని ఆయన ఆరోపిస్తున్నాడు.

మరోవైపు ఈ వీడియోపై బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల వెనక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. మోదీపై నామినేషన్ వేసిన వ్యక్తే ఆయన హత్యకు కుట్ర పన్నడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. మోదీని ఎదుర్కోలేక ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నాయని ఆయన మండిపడ్డారు.