విషాదం..క్రికెట్ బంతి గుండెకు తగిలి బాలుడు మృతి

క్రికెట్ ఆడేటప్పుడే కాదు, చూసేటప్పుడు కూడా జాగ్రత్తలు అవసరం. లేకపోతే ఊహించని విషాదాలు చోటుచేసుకుంటాయి. ఇప్పడు ఓ 10 ఏళ్ల బాలుడు ఊహించని మరణం..క్రికెట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు సూచిస్తుంది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మోహిన్ అనే బాలుడు సాయంత్రం సమయంలో ఆడుకునేందుకు దగ్గర్లో ఉన్న క్రికెట్ గ్రౌండ్‌కి వెళ్లాడు. అయితే ఆటలో పాలుపంచుకోకపోయిన క్రికెట్ బంతి అతడి ప్రాణాలు తీసింది. దూరంగా నిలబడి చూస్తోన్న అతడి గుండెకు బంతి బలంగా వచ్చి తగిలింది. అంతే […]

విషాదం..క్రికెట్ బంతి గుండెకు తగిలి బాలుడు మృతి

Updated on: Jan 18, 2020 | 4:09 PM

క్రికెట్ ఆడేటప్పుడే కాదు, చూసేటప్పుడు కూడా జాగ్రత్తలు అవసరం. లేకపోతే ఊహించని విషాదాలు చోటుచేసుకుంటాయి. ఇప్పడు ఓ 10 ఏళ్ల బాలుడు ఊహించని మరణం..క్రికెట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు సూచిస్తుంది.

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మోహిన్ అనే బాలుడు సాయంత్రం సమయంలో ఆడుకునేందుకు దగ్గర్లో ఉన్న క్రికెట్ గ్రౌండ్‌కి వెళ్లాడు. అయితే ఆటలో పాలుపంచుకోకపోయిన క్రికెట్ బంతి అతడి ప్రాణాలు తీసింది. దూరంగా నిలబడి చూస్తోన్న అతడి గుండెకు బంతి బలంగా వచ్చి తగిలింది. అంతే వెంటనే కుప్పకూలిపోయాడు మోహిన్. కొనప్రాణంతో ఉన్న అతనిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూశాడు. ఆడుకుని మరికొద్దిసేపట్లో ఇంటికి వస్తాడనుకున్న కొడుకు..విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.