Bowenpally Kidnap Case Live Updates: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసు నిమిషానికో మలుపు తిరుగుతోంది. ప్రవీణ్ సోదరుల కిడ్నాప్ కేసును తక్కువ సమయంలో చేధించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను అదుపులోకి తీసుకుని.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కాగా, అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులను ఆదేశించి సికింద్రాబాద్ కోర్టు.. విచారణను రేపటికి వాయిదా వేసింది.
కిడ్నాప్ వ్యవహారంలో ముందే అఖిలప్రియను అదుపులోకి తీసుకోకపోతే కీలక సాక్ష్యాధారాలు తారుమారు అవుతాయని పోలీసులు భావించారు. అఖిలప్రియకు, భార్గవ్ రామ్‌కు గతంలో నేర చరిత్ర ఉంది. అంతేకాకుండా సాక్ష్యాధారాలను తారుమారు చేయడంలో అఖిలప్రియకు పలుకుబడి ఉంది. కాగా, రిమాండ్ రిపోర్టులో ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు చూపించారు.
పక్కా స్కెచ్ ప్రకారం ప్రవీణ్ రావును కిడ్నాప్ చేయించారు. కిడ్నాప్ అనంతరం అవుటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ఒక ఫాం హౌస్‌లో బంధించారు. అక్కడే కిడ్నాపర్లు ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా సంతకాలు తీసుకునే సమయంలో కిడ్నాపర్లు అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి, భార్గవరాం పేర్లను ప్రస్తావించినట్లు బాధితులు తెలిపారు. ఆ ముగ్గురితో కూడా సంభాషించారని అన్నారు. అటు సంతకాలు తీసుకునే సమయంలో కిడ్నాపర్లు కర్రలతో దాడి చేసినట్లు బాధితులు పేర్కొన్నారు.
ల్యాండ్ వ్యవహారంలో ప్రవీణ్ రావు నుంచి డబ్బులు రాబట్టేందుకు అఖిలప్రియ దంపతులు భారీ స్కెచ్ వేశారు. కిడ్నాపింగ్‌లో ఎక్స్‌పర్ట్ అయిన సాయితో కలిసి ప్రవీణ్ రావును అఖిలప్రియ దంపతులు కిడ్నాప్ చేయించారు.
మొదట చేసుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా పెరిగిన భూమి విలువ ప్రకారం మరికొన్ని డబ్బులు చెల్లించాలని ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ వేర్వేరుగా ప్రవీణ్ రావును డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. అయితే వారిద్దరూ డిమాండ్ చేసిన డబ్బులను చెల్లించడానికి ప్రవీణ్ రావు నిరాకరించారు. డబ్బులు చెల్లించేది లేదని ఖరాఖండీగా తేల్చి చెప్పేశారు.
ల్యాండ్ వ్యవహారంలో ఏవి సుబ్బారెడ్డి చేసుకున్న రహస్య ఒప్పందం, సెటిల్మెంట్ విషయాలను తెలుసుకుని భూమా అఖిలప్రియ భగ్గుమన్నారు. భూమి విషయంలో తమతో కాకుండా ఏవీ సుబ్బారెడ్డితో ఎలా ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రవీణ్ రావును అఖిలప్రియ బెదిరించారు.
2016లో హఫీజ్‌పేటలో సర్వే నెంబర్ 80లో ప్రవీణ్ కుమార్ 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇక ఆ భూమి తమదేనంటూ ఏ.వి. సుబ్బారెడ్డి, అఖిలప్రియ, భార్గవ్ రామ్ లిటిగేషన్ పెట్టారు.
దీనితో ఆ భూ వివాదంపై ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఏవి సుబ్బారెడ్డికి ప్రవీణ్ రావు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించారు. ఇక ఈ సెటిల్మెంట్ విషయం తెలుసుకున్న భూమా అఖిలప్రియ భగ్గుమన్నారు.
ప్రవీణ్ రావు కిడ్నాప్ వ్యవహరంలో నిమిషానికో విషయం వెలుగులోకి వస్తున్నాయి. ల్యాండ్ వ్యవహారంలో ఏ.వి. సుబ్బారెడ్డి పెద్ద ఎత్తున లాభం పొందినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో సుమారు రూ. 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి.
అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టులో వాదనలు ముగిశాయి. అనారోగ్యం దృష్ట్యా అఖిలప్రియ తరపు లాయర్ బెయిల్ కోరారు.బెయిల్ అయితే పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులను ఆదేశించి సికింద్రాబాద్ కోర్టు.. బెయిల్ పిటిషన్‌పై తీర్పును రేపటికి వాయిదా వేసింది.
బోయినపల్లి కిడ్నాప్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలను టీవీ9 సంపాదించింది. భూమా అఖిలప్రియను రిపోర్టులో ఏ1గా పోలీసులు పేర్కొన్నారు. ఏ2గా ఎ.వి.సుబ్బారెడ్డి, ఏ3గా భార్గవ్‌రామ్‌ను పేర్లు నమోదు చేశారు. శ్రీనివాసరావు, సాయి, చంటి, ప్రకాశ్‌ను నిందితులుగా చేర్చారు. వీరిపై ఐపీసీ 147, 120బి, 452, 419, 341, 342, 506, 365, 324, 385 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కళ్లకు గంతలు కట్టి తమను తీసుకెళ్లినట్లు పోలీసులకు బాధితులు తెలిపారు. హఫీజ్‌పేట సర్వే నంబర్. 80లో 2016లో బాధితులు 25 ఎకరాల భూములు కొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ భూములు తమవేనని భూమా అఖిల ప్రియ, భార్గవ్ రామ్, సుబ్బా రెడ్డి వాదిస్తున్నారు. సుబ్బారెడ్డికి ప్రవీణ్ రావు డబ్బులిచ్చి మేటర్ సెటిల్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే భూమి ధర పెరగడంతో..నిందితులు సమస్యలు సృష్టించారని..ఇంకా డబ్బు కావాలంటూ డిమాండ్ చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ప్రవీణ్ రావు కిడ్నాప్ వ్యవహరంలో అసలు నిజాలు బయటకొస్తున్నాయి. హఫీజ్‌పేట సర్వే నెం.80లో 2016లో ప్రవీణ్ కుటుంబ సభ్యులు 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలోనే ప్రవీణ్ రావు ఏవీ సుబ్బారెడ్డికి డబ్బులు ఇచ్చి ఒప్పందం చేసుకున్నారని, భూమి ధర పెరగడంతో నిందితులు సమస్య సృష్టించారని పోలీసులు తెలిపారు. ఇంకా డబ్బులు ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేశారని, ప్రస్తుతం ఆ భూమి తమదేనని అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి, భార్గవ్ రామ్ వాదిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు.
బోయిన్‌పల్లికి చెందిన ప్రవీణ్ రావు కిడ్నాప్ వ్యహరాం నిమిషానికో మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు ఈ కేసులో ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అఖిల ప్రియ రిమాండ్ రిపోర్టులో కొత్త విషయం తెలిసింది. ఏ1గా భూమా అఖిల ప్రియ పేరును పేర్కొనడం గమనార్హం. ఇక ఏ2గా సుబ్బారెడ్డి, ఏ3గా భార్గవ్ రామ్ పేర్లను చేర్చారు.
ప్రవీణ్ రావు కిడ్నాప్ వ్యవహరం విషయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న ఏవీ సుబ్బారెడ్డి తన పాత్ర లేదంటుంటే అఖిల ప్రియ బంధువులు కూడా తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. అయితే ఈ నకిలీ ఐటీ అధికారులను పంపిందెవరు. ఈ డ్రామాకు తెరవెనక స్కెచ్ వేసింది ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్, అతని సోదరుడు చంద్ర హాస్ పరారీలో ఉండడంతో ఇదంతా చేసింది వారే అనే అనుమానాలకు బలం చేకూరుతుంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు భార్గవ్ రామ్, అతని సోదరుడు చంద్రహాస్‌ను పట్టుకునే క్రమంలో ఇప్పటికే బెంగళూరు, చెన్నైలో గాలిస్తున్నారు.
కిడ్నాప్ కేసుగా నమోదై భూవివాదంగా మారిన బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహరంలో మాజీ మంత్రి అఖిల ప్రియపై అదనంగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఐపీసీ 147, 385 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే అఖిల ప్రియ తరఫు న్యాయవాదులు వేసిన బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో సికింద్రబాద్ కోర్టులో విచారణ జరగనుంది.
ప్రవీణ్ రావు కిడ్నాప్ వ్యవహరంపై ఆయన సోదరుడు ప్రతాప్ రావు స్పందించారు. ‘టీవీ9’తో ప్రతాప్ రావు మాట్లాడుతూ.. ‘ఏవీ సుబ్బారెడ్డి ఒకప్పుడు నాకు ప్రాణ స్నేహితుడాగా ఉండేవాడు. అయితే కొన్ని రోజుల క్రితం మా మధ్య విభేదాలు వచ్చాయి. ఓ భూమి విషయమై మేము సుబ్బారెడ్డిపై కేసు పెట్టాం. ఆ ల్యాండ్ విషయంలో ఏవీ సుబ్బారెడ్డితో మాకు ఒప్పందం జరిగింది. రెండేళ్ల క్రితమే ఈ విషయాన్ని అఖిల సోదరి మౌనికకు ఈ విషయం చెప్పాం. ఏదైనా ఉంటే అఖిల ప్రియ ఏవీ సుబ్బారెడ్డితో మాట్లాడుకోవాలి. మమ్మల్ని బెదిరించి ల్యాండ్ కబ్జా చేయాలని చూశారు. పోలీసులు సమయానికి స్పందించడంతోనే మా సోదరులు ప్రాణాలతో బయటపడ్డారు’ అని ప్రతాప్ రావు చెప్పుకొచ్చారు.
కిడ్నాప్ కేసుగా మొదలైన ప్రవీణ్ రావు ఉదంతం ఇప్పుడు భూవివాదంగా మారింది. హఫీజ్ పేట్‌లోని 50 ఎకరాల విషయంలో నెలకొన్న వివాదమే ప్రవీణ్ రావు కిడ్నాప్‌కు కారణంగా పోలీసులు గుర్తించారు. ఇక ప్రవీణ్ రావును కిడ్నాప్ చేయించడంలో మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ సోదరుడు చంద్ర హాస్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. కిరాయి గూండాలతో కిడ్నాప్ చేయించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఈ భూ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఇప్పటికే నాలుగు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపడుతున్నాయి.
ప్రవీణ్ రావు కిడ్నాప్ కేసు, హఫీజ్ భూవివాదంపై పోలీసుల విచారణ వేగవంతం చేశారు. అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ సోదరుడు చంద్ర హాస్ ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని దగ్గరుండి చూసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. సోదరులు ఇద్దరు కలిసి కిడ్నాప్‌కు స్కెచ్ వేశారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి కోసం నాలుగు పోలీసు బృందాలు వెతుకుతున్నాయి. భార్గవ్ రామ్ చెన్నై లేదా బెంగళూరులో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
బోయిన్ పల్లి ప్రవీణ్ రావు కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. గతంలో హఫీజ్ పేట్‌లో భూములను ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి కొనుగోలు చేశారు. భూమా నాగిరెడ్డికి ప్రవీణ్ రావు తండ్రి కిషన్ రావు అత్యంత సన్నిహితుడని సమాచారం. నాగిరెడ్డి బతికున్న సమయంలో కిషన్ రావు భూమాకి కీలకంగా వ్యవహరించాడని తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత హఫీజ్ పేట్ భూమిలోకి ఏవీ సుబ్బారెడ్డి ప్రవేశించారు. దీంతో 2020లో ఏవీ సుబ్బారెడ్డిపై ప్రవీణ్ రావు ట్రైస్ పాస్ కేసు నమోదు చేశారు. దీంతో 50 ఎకరాల భూమిలో చెరో 25 ఎకరాల ల్యాండ్ చెందేట్లు ఒప్పందం జరిగింది. అయితే తాజాగా మిగతా 25 ఎకరాలు కూడా తమకే కావాలని ప్రవీణ్ రావ్ పై భూమా కుటుంబ సభ్యుల ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ కారణంగానే ప్రవీణ్ రావు కిడ్నాప్ జరిగి ఉంటుందని పోలీసులు ఓ అంచనాకు వస్తున్నారు.
బోయిన్‌పల్లి ప్రవీణ్ రావు కిడ్నాప్ కేసును పోలీసులు చాలెంజింగ్‌గా తీసుకున్నారు. ఇప్పటికే అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు బెంగళూరు చేరుకోగా. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సైతం విచారణను వేగవంతం చేశారు… ప్రవీణ్ రావును ఇంట్లో నుంచి తీసుకెళ్లిన నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.
బోయిన్ పల్లిలో ప్రవీణ్ రావు కిడ్నాప్ వ్వవహారంలో అరెస్టు అయిన అఖిల ప్రియ ప్రస్తుతం చంచల గూడ జైలులో ఉన్నారు. అయితే ఆరోగ్య కారణం దృష్ట్యా వేసిన బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ మారేడ్‌పల్లి కోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే ఈ కిడ్నాప్ వ్యవహరమంతా అఖిల ప్రియా కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసు విచారణలో భూమా అఖిల ప్రియనే కీలకంగా మారుతుండడంతో కౌంటర్ వాదనలను వినిపించడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు.
ప్రవీణ్ రావు కిడ్నాప్ కేసులో ఏ2గా ఉన్న మాజీ మంత్రి అఖిల ప్రియ ఇంకా చంచల గూడ జైలులోనే ఉన్నారు. బుధవారం అదుపులోకి తీసుకున్న సమయంలో కాస్త అస్వస్థతకు గురికావడంతో అఖిల ప్రియను అధికారులు అబ్జర్వేషన్‌లోనే ఉంచారు. ఇక గురువారం ఉదయం అఖియ ప్రియ కేవలం జ్యూస్ మాత్రమే తీసుకున్నారని, ఆమె కాస్త అనారోగ్యంతో ఉన్నారని అధికారులు తెలిపారు.
బోయిన్‌పల్లి ప్రవీణ్ రావు కిడ్నాప్ కేసులో ఏ1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని 41 CRPC కింద నోటీసు ఇచ్చి వదిలేసిన విషయం తెలిసిందే. అయితే సుబ్బారెడ్డిని మరోసారి పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భార్గవ్ రామ్ పట్టుపడితే హఫీజ్ పేట భూ వివాదంలో ఏవీ సుబ్బారెడ్డి పాత్రపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి..
ప్రవీణ్ రావు కిడ్నాప్ కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. భార్గవ్ రామ్ బెంగళూరులో తలదాచుకున్నాడన్న సమాచరంతో పోలీసు ప్రత్యేక బృందాలు బెంగళూరు చేరుకున్నట్లు తెలుస్తోంది.
ప్రవీణ్ రావు కిడ్నాప్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న మాజీ మంత్రి అఖిల ప్రియ ప్రస్తుతం చంచలగూడ పోలీస్ స్టేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అఖిల ప్రియ బెయిల్ పిటషన్ మరికాసేపట్లో కోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె కొంత అనారోగ్యంతో ఉందని అధికారులు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవీణ్ రావు కిడ్నాప్ వ్యవహరానికి హఫీజ్ పేట భూ వివాదమే కారణమని పోలీసులు తేల్చిచెప్పారు. సుమారు రూ.100 కోట్ల విలువైన ఈ భూమిపై గత కొద్ది రోజులుగా ప్రవీణ్ రావు, భూమా కుటుంబాల మధ్య వివాదం నెలకొని ఉందని పోలీసులు తెలిపారు.
కాసేపట్లో అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరగనుంది. అఖిల ప్రియ గర్భవతి కావడం… పోలీసులు అదపులోకి తీసుకున్న సమయంలో అస్వస్థతకు గురికావడంతో ఆమె పిటిషన్‌పై ఉత్కంఠత నెలకొంది. మరి బెయిల్ మంజూరు అవుతుందో లేదో చూడాలి.
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మరో నిందితుడైన ఏవి సుబ్బారెడ్డికి పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి వదిలేశారు. అయితే ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. భార్గవ్ అరెస్ట్ తర్వాత వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. ప్రవీణ్ రావు కిడ్నాప్ కేసులో సుబ్బారెడ్డిని పోలీసులు ఏ1గా ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రవీన్ రావు కిడ్నాప్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ఇంకా పరారీలోనే ఉన్నారు. భార్గవ్ రామ్ కోసం 15 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.