ఐష్‌కి అన్నయ్యగా నటించడం బాధగా అనిపించింది.. మేము ఎప్పటికైనా

| Edited By: Pardhasaradhi Peri

Apr 24, 2020 | 9:33 PM

విశ్వ సుందరి ఐశ్వర్యా రాయ్‌కి అన్నగా నటించడం నాకెంతో బాధ కలిగించిందని అన్నారు బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్. ఓ సినిమాలో ఐష్‌‌కు అన్నయ్యగా నటించడం తనని ఎంతగానో బాధ పెట్టిందని షారుఖ్ పేర్కొన్నారు. 2000లో విడుదలైన ‘జోష్’ సినిమాలో షారుఖ్, ఐష్‌లు అన్నా చెల్లిల్లుగా మొదటిసారి కలిసి నటించారు. ఆ తర్వాత కూడా వీరిద్దరూ దర్శకుడు లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘దేవదాస్’ చిత్రంలో నటించినప్పటికీ చివరికి కలుసుకోకుండానే కథ సుఖాంతం అవుతుంది. ఈ నేపథ్యంలో ఓ […]

ఐష్‌కి అన్నయ్యగా నటించడం బాధగా అనిపించింది.. మేము ఎప్పటికైనా
Follow us on

విశ్వ సుందరి ఐశ్వర్యా రాయ్‌కి అన్నగా నటించడం నాకెంతో బాధ కలిగించిందని అన్నారు బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్. ఓ సినిమాలో ఐష్‌‌కు అన్నయ్యగా నటించడం తనని ఎంతగానో బాధ పెట్టిందని షారుఖ్ పేర్కొన్నారు. 2000లో విడుదలైన ‘జోష్’ సినిమాలో షారుఖ్, ఐష్‌లు అన్నా చెల్లిల్లుగా మొదటిసారి కలిసి నటించారు. ఆ తర్వాత కూడా వీరిద్దరూ దర్శకుడు లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘దేవదాస్’ చిత్రంలో నటించినప్పటికీ చివరికి కలుసుకోకుండానే కథ సుఖాంతం అవుతుంది. ఈ నేపథ్యంలో ఓ అవార్డు ఫంక్షన్‌లో షారుఖ్ ఐష్‌తో నటించడం గురించి స్పందించారు.

ఐష్, నేను మొదటిసారి ‘జోష్’ సినిమాలో నటించాము. అందులో మేము కవలలుగా కనిపించాం. ఈ ప్రపంచంలోనే ఎంతో అందమైన ఐష్.. నాకు చెల్లి పాత్రలో నటించడం నాకెంతో బాధగా అనిపించిందని చెప్పుకొచ్చారు షారుఖ్. ఆ తర్వాత ‘దేవదాస్‌’లో కలిసి నటించినా.. చివరకు మేము కలవము. కానీ ఎప్పటికైనా తనతో ఓ సాధారణమైన సినిమాలో నటించాలని ఉందని తెలిపారు షారుఖ్.

Read More: 

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

గుడ్‌న్యూస్: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్