బాలీవుడ్ అగ్ర దర్శకుడు బసు చటర్జీ కన్నుమూత

బాలీవుడ్ అగ్ర దర్శకుడు బసు చటర్జీ కన్నుమూశారు. 93 ఏళ్ల బసు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూన్ 3న తుదిశ్వాస విడిచాడు. సామాజిక అంశాలను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో బసు చటర్జీ మంచి దిట్ట

బాలీవుడ్ అగ్ర దర్శకుడు బసు చటర్జీ కన్నుమూత

Updated on: Jun 04, 2020 | 3:44 PM

బాలీవుడ్ అగ్ర దర్శకుడు బసు చటర్జీ కన్నుమూశారు. 93 ఏళ్ల బసు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూన్ 3న తుదిశ్వాస విడిచాడు. 1930 జనవరి 10న బసు అజ్మీర్‌లో జన్మించిన బసు ఛటర్జీ.. సామాజిక అంశాలను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో మంచి దిట్ట. చోటీసీ బాత్, రజనీగంధ, బాతో బాతో మే, ఏక్ రుకాహువా పైసలా, చమేలీకి షాది తదితర సినిమాలకు బసు దర్శకత్వం వహించారు. హిందీతో పాటు బెంగాలీలో కూడా ఆయన అనేక సినిమాలు తెరకెక్కించారు. 70 వ దశకంలో బాలీవుడ్ అందరూ సూపర్ స్టార్లతో కలిసి సినిమాలు చేశారు. బసు మృతిపట్ట సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. సినీ రంగంలోనే కాకుండా టెలివిజన్ రంగంలోనూ బసు చటర్జీ తనదైన ముద్ర వేసుకున్నారు. పలు సీరియల్స్ కి కథ మాటలు రాశారు. దూరదర్శన్‌లో బ్యోంకేశ్ బక్షి, రజని వంటి రెండు సిరీస్‌లు అప్పట్లో ప్రజాదరణ పొందాయి. 1992లో బసు జాతీయ అవార్డు అందుకున్నారు. ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటని పలువురు ప్రముఖులు కొనియాడారు.