మహారాష్ట్ర: కృష్ణానదిలో పడవ బోల్తా.. 9 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. సాంగ్లి జిల్లా బ్రాహ్మణల్ గ్రామం వద్ద కృష్ణానదిలో పడవ బోల్తా పడి 9 మంది మృతి చెందారు. 21 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో పడవలో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. భారీ వర్షాల కారణంగా వరదలో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కృష్ణానదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.