AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభినందన్ వర్థమాన్ కు అత్యున్నత “వీరచక్ర”

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్..ఇతడో నిలువెత్తు పరాక్రమానికి, ధైర్యసాహసాలకు నిదర్శనం. ఇప్పుడు ఆ వీరుడికి అత్యున్నత పురస్కారం దక్కనుంది. భారత ప్రభుత్వం ఉన్నత మిలటరీ పురస్కారంతో అభినందన్ ను సత్కరించనున్నట్లు తెలుస్తోంది. బాలకోట్ లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడుల అనంతరం గగనతలంలో జరిగిన పోరులో పాక్ ఎఫ్ -16  విమానాన్ని అభినందన్ తన  మిగ్ -21 బైసన్ యుద్ధ విమానంతో కూల్చేశారు.  అనంతరం అనుకోకుండా పాకిస్థాన్ కు చిక్కాడు. దాయాది చేతిలో […]

అభినందన్ వర్థమాన్ కు అత్యున్నత వీరచక్ర
Anil kumar poka
|

Updated on: Aug 09, 2019 | 12:04 PM

Share

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్..ఇతడో నిలువెత్తు పరాక్రమానికి, ధైర్యసాహసాలకు నిదర్శనం. ఇప్పుడు ఆ వీరుడికి అత్యున్నత పురస్కారం దక్కనుంది. భారత ప్రభుత్వం ఉన్నత మిలటరీ పురస్కారంతో అభినందన్ ను సత్కరించనున్నట్లు తెలుస్తోంది. బాలకోట్ లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడుల అనంతరం గగనతలంలో జరిగిన పోరులో పాక్ ఎఫ్ -16  విమానాన్ని అభినందన్ తన  మిగ్ -21 బైసన్ యుద్ధ విమానంతో కూల్చేశారు.  అనంతరం అనుకోకుండా పాకిస్థాన్ కు చిక్కాడు. దాయాది చేతిలో చిత్రహింసలు అనుభవించాడు. చివరకు భారత ప్రభుత్వం తెచ్చిన ఒత్తిడికి తలొగ్గి రెండు రోజుల తర్వాత అతడిని మన దేశానికి అప్పగించింది పాక్ ప్రభుత్వం. ఇందుకుగానూ కేంద్రం ఆయనకు వీరచక్ర పురస్కారం అందించనున్నట్లు సమాచారం. పరమవీర చక్ర, మహావీర చక్ర పురస్కారాల తర్వాత అత్యున్నత మిలటరీ పురస్కారం వీరచక్ర. వర్థమాన్ తో పాటుగా బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై బాంబులు జారవిడిచిన మరో ఐదుగురు మిరాజ్ 2000 ఫైటర్ పైలట్లను కూడా కేంద్రం సత్కరించనున్నట్లు తెలుస్తోంది. వారి సాహసానికి గుర్తింపుగా వాయుసేన మెడల్స్ ను కూడా బహుకరించనుంది.

Follow Us
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్
ఈ కేంద్ర ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే క్షణాల్లోనే అన్నీ..
ఈ కేంద్ర ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే క్షణాల్లోనే అన్నీ..
నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యం ఇదే.. ఏది వద్దు ఇది తాగండి చాలు..
నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యం ఇదే.. ఏది వద్దు ఇది తాగండి చాలు..