కంగనా ఆఫీసును కూల్చివేసిన ముంబాయి మున్సిపల్‌ అధికారులు

బాలీవుడ్‌ సివంగి కంగనా రనౌత్‌కు, పెద్దపులి శివసేనకు మధ్య పోరాటం రోజురోజుకూ ముదురుతోంది.. విసిరిన సవాల్‌ను నిలబెట్టుకుంటూ కంగనా ఇవాళ ముంబాయిలో అడుగుపెట్టారు.. ఆమె వచ్చారో లేదో మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె కార్యాలయాన్ని కూల్చివేయడం మొదలు పెట్టింది… తన ఆఫీసును చట్ట విరుద్ధంగా కూల్చివేస్తున్నారని కంగాన మండిపడుతున్నా సర్కారు పట్టించుకోలేదు.. మహారాష్ట్ర గౌరవం కోసం తాను రక్తం ధారపోయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రతినబూనానని, తనకు ఆస్తి అతి చిన్న విషయమని కంగనా తెలిపారు.. ఇవేవీ తన ఆత్మస్థైర్యాన్ని […]

కంగనా ఆఫీసును కూల్చివేసిన ముంబాయి మున్సిపల్‌ అధికారులు
Follow us

|

Updated on: Sep 09, 2020 | 1:56 PM

బాలీవుడ్‌ సివంగి కంగనా రనౌత్‌కు, పెద్దపులి శివసేనకు మధ్య పోరాటం రోజురోజుకూ ముదురుతోంది.. విసిరిన సవాల్‌ను నిలబెట్టుకుంటూ కంగనా ఇవాళ ముంబాయిలో అడుగుపెట్టారు.. ఆమె వచ్చారో లేదో మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె కార్యాలయాన్ని కూల్చివేయడం మొదలు పెట్టింది… తన ఆఫీసును చట్ట విరుద్ధంగా కూల్చివేస్తున్నారని కంగాన మండిపడుతున్నా సర్కారు పట్టించుకోలేదు.. మహారాష్ట్ర గౌరవం కోసం తాను రక్తం ధారపోయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రతినబూనానని, తనకు ఆస్తి అతి చిన్న విషయమని కంగనా తెలిపారు.. ఇవేవీ తన ఆత్మస్థైర్యాన్ని తగ్గించవని, పైపెచ్చు పెంచుతాయని సర్కార్‌కు కౌంటర్‌ ఇచ్చారు కంగనా. అంతేనా… తన కార్యాలయాన్ని ఆమె రామమందిరంతో పోల్చుకున్నారు.. బాబర్‌ ఆర్మీ తన ఆఫీసును కూల్చివేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.. తానెప్పుడూ తప్పు చేయలేదని, తన శత్రువులు మాత్రం తన మాటలను పదే పదే నిజం చేస్తున్నారని కంగనా అన్నారు. ఇందుకే తాను ముంబాయిని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చానని కంగనా ట్వీట్‌ చేశారు..