ఇరాన్‌లోని మెడికల్ క్లినిక్‌లో భారీ పేలుళ్లు.. 19 మంది మృతి..

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ఓ మెడికల్‌ క్లినిక్‌లో గ్యాస్‌ లీకై భారీ పేలుడు సంభవించింది. నగరంలోని సైనా అట్‌హార్‌ క్లినిక్‌లో మంగళవారం రాత్రి 10.56 గంటల ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయని,

ఇరాన్‌లోని మెడికల్ క్లినిక్‌లో భారీ పేలుళ్లు.. 19 మంది మృతి..

Edited By:

Updated on: Jul 01, 2020 | 7:42 AM

Blast at Irans clinic: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ఓ మెడికల్‌ క్లినిక్‌లో గ్యాస్‌ లీకై భారీ పేలుడు సంభవించింది. నగరంలోని సైనా అట్‌హార్‌ క్లినిక్‌లో మంగళవారం రాత్రి 10.56 గంటల ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయని, ఈ ఘటనలో మెడికల్ క్లినిక్‌లో 19 మంది మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని టెహరాన్ డిప్యూటీ గవర్నర్ హమీద్ రెజా చెప్పారు. మెడికల్ క్లినిక్‌లో గ్యాస్ లీకవడం వల్ల భారీ పేలుడు సంభవించిందని గవర్నర్ హమీద్ రెజా పేర్కొన్నారు.

సంఘటన అనంతరం అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ అధికారులు.. నిచ్చెనలతో భవనంపైకి ఎక్కి మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. మెడికల్ క్లినిక్‌లో పేలుడు జరిగినపుడు 25 మంది ఉద్యోగులున్నారని, చిన్న చిన్న శస్త్రచికిత్సలు కొనసాగుతున్నాయని ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం రాజధాని నగరంలో ఉన్న మిలటరీ కాంప్లెక్స్‌లో కూడా పేలుళ్లు సంభవించాయి.

Also Read: ఆదాయమే లక్ష్యంగా.. తెలంగాణలో మరో రెండు టోల్‌ప్లాజాలు..