యూపీలో మద్యంపై బీజేపీ ఎంపీ పోరాటం
మద్యానికి బానిసైన తన కొడుకు మృతిని జీర్ణించుకోలేని బీజేపీ ఎంపీ ఒకరు మద్య నిషేధం కోసం ఉద్యమిస్తానని ప్రమాణం చేశారు. యూపీలోని మోహన్ లాల్ గంజ్ నుంచి ఎంపీగా ఎన్నికైన కౌశల్ కిషోర్.. తన 28 ఏళ్ళ కుమారుడు మద్యానికి అలవాటు పడి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడని తెలిపారు. పరిమితికి మించి లిక్కర్ తాగిన ఆకాష్ కిషోర్ గత నెల 19 న మృతి చెందాడు. అతడిని డీ ఎడిక్షన్ సెంటర్ లో ఎన్ని సార్లు చేర్పించినా […]

మద్యానికి బానిసైన తన కొడుకు మృతిని జీర్ణించుకోలేని బీజేపీ ఎంపీ ఒకరు మద్య నిషేధం కోసం ఉద్యమిస్తానని ప్రమాణం చేశారు. యూపీలోని మోహన్ లాల్ గంజ్ నుంచి ఎంపీగా ఎన్నికైన కౌశల్ కిషోర్.. తన 28 ఏళ్ళ కుమారుడు మద్యానికి అలవాటు పడి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడని తెలిపారు. పరిమితికి మించి లిక్కర్ తాగిన ఆకాష్ కిషోర్ గత నెల 19 న మృతి చెందాడు. అతడిని డీ ఎడిక్షన్ సెంటర్ లో ఎన్ని సార్లు చేర్పించినా ఫలితం లేకపోయిందని కౌశల్ తెలిపారు. తాము మద్యం ముట్టబోమని 100 మంది యువకుల చేత ప్రమాణం చేయిస్తానని ఆయన ప్రకటించారు. డిసెంబరు 3 నుంచి తన ఉద్యమం మొదలవుతుందన్నారు.