ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్స్.. బండి బాషను అందుకున్న జీవీఎల్.. కాకరేపుతున్న బీజేపీ నేత కామెంట్స్
తెలంగాణ ఎన్నికల్లో ఒక సరిజికల్ స్టైక్ చేస్తే, ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు బీజేపీ నేత, ఎంపీ.. జీవీఎల్ నరసింహారావు....
తెలంగాణ ఎన్నికల్లో ఒక సరిజికల్ స్టైక్ చేస్తే, ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు బీజేపీ నేత, ఎంపీ.. జీవీఎల్ నరసింహారావు. పోలీస్ స్టేషన్లలో క్రిస్మస్ వేడుకలు జరపాలని ప్రభుత్వం ఆదేశించిందని.. అంటే, క్రిస్టియానిజంని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. పోలీస్ స్టేషన్లు వేదికగా ప్రభుత్వం మత ప్రచారం ఎలా చేస్తుందని ఆయన ప్రశ్నించారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ కార్యక్రంగా భావిస్తున్నామని అన్నారు. ఇవి మానుకోపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఏపీ సర్కారుని ఆయన హెచ్చరించారు. గుంటూరు పోలీస్ స్టేషన్ పై ఒక వర్గం వాళ్ళు దాడి చేస్తే జగన్ ప్రభుత్వం ఆ కేసులు ఎత్తివేసిందని ఆయన ఆరోపించారు. తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ పోటీ చేయాలని భావిస్తోందని, అయితే తుది నిర్ణయం కేంద్ర అధినాయకత్వం తీసుకుంటుందని వెల్లడించారు. బీజేపీ, జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్థిపై ఇప్పటికే చర్చించాయన్నారు. ఎవరు పోటీ చేయాలనే దానిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని జీవీఎల్ చెప్పారు.