బీజేపీతో జనసేన పొత్తా? విలీనమా?.. తేలేది కనుమరోజు!

| Edited By:

Jan 14, 2020 | 10:52 PM

బిజెపి జనసేన మధ్య కొత్త స్నేహం చిగురించింది. ఇరు పార్టీలు కలిసి పని చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 16న విజయవాడలో బిజెపి రాష్ట్ర నాయకులతో ఉమ్మడి సమావేశం ఉంటుందన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ప్రధాని మోడీ ఆశయాలు ఏపీలో అమలుకావడం లేదన్నారు. రాష్ట్రంలో పరిస్థితుల్ని ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు పవన్. భవిష్యత్తు గురించి బిజెపి నేతలతో జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు. రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్ మాట్లాడుతూ.. బీజేపీ జనసేన విలీనంపై ఇప్పటివరకు […]

బీజేపీతో జనసేన పొత్తా? విలీనమా?.. తేలేది కనుమరోజు!
Follow us on

బిజెపి జనసేన మధ్య కొత్త స్నేహం చిగురించింది. ఇరు పార్టీలు కలిసి పని చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 16న విజయవాడలో బిజెపి రాష్ట్ర నాయకులతో ఉమ్మడి సమావేశం ఉంటుందన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ప్రధాని మోడీ ఆశయాలు ఏపీలో అమలుకావడం లేదన్నారు. రాష్ట్రంలో పరిస్థితుల్ని ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు పవన్. భవిష్యత్తు గురించి బిజెపి నేతలతో జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు.

రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్ మాట్లాడుతూ.. బీజేపీ జనసేన విలీనంపై ఇప్పటివరకు స్పష్టమైన ఆదేశాలేవి తనకు రాలేదని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, కార్యకర్తలపై, ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడం జరుగుతుందని ఆరోపించారు. ఈ క్రమంలో బిజెపి అండదండలు ఆ పార్టీలకు అవసరమని తెలిపారు. చాలా పార్టీలు కూడా ఇదే ఆలోచనతో ఉన్నాయని తాము భావిస్తున్నట్లు భానుప్రకాష్ అన్నారు.

ఈ నెల 16న బిజెపి, జనసేన కీలక సమావేశం జరగనుంది. ఇరు పార్టీల నేతలు విజయవాడలో సమావేశం కానున్నారు. 2014 లో జనసేన బిజెపికి  మద్దతిచ్చింది. మోదీ చంద్రబాబుకు మద్దతుగా జనసేనాని ప్రచారం చేశారు. 2017లో బీజేపీకి రాంరాం చెప్పింది జనసేన పార్టీ. అయితే ఈ సారి కలిసి పని చేస్తామన్నారా? కలుస్తామన్నారా? అన్న దానిపై పార్టీ వర్గాల్లో ఉధృతంగా చర్చ జరుగుతోంది. కాగా.. పార్టీ విలీనం కోసం బిజెపి పట్టుబడుతోంది. చర్చల వరకే పరిమితం అని పవన్ అంటున్నారు. చివరికి జరిగేదేంటో కాలమే చెప్పాలి.