AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చావును జయించేందుకు కొత్త దారి.. ల్యాబ్‌లో ‘బేబీ క్లోన్’ను సృష్టించిన 48 ఏళ్ల శ్రీమంతుడు!

అమెరికన్ టెక్ బిలియనీర్, 'రివర్స్ ఏజింగ్' పిచ్చిగా భావించే బ్రయాన్ జాన్సన్ (48) మరోసారి ఆన్‌లైన్‌లో హాట్ టాపిక్‌గా మారారు. వృద్ధాప్యాన్ని జయించి, అమరత్వం సాధించాలనే లక్ష్యంతో ఉన్న ఆయన, ల్యాబ్‌లో తన సొంత "బేబీ క్లోన్"ను సృష్టించినట్లు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించారు. బేబీ బ్రయాన్ అని పిలుచుకుంటున్న ఈ చిన్న క్లోన్ ప్రస్తుతం ఒక పెట్రీ డిష్‌లో పెరుగుతోందని చెప్పడం పెద్ద కలకలాన్నే రేపింది.

చావును జయించేందుకు కొత్త దారి.. ల్యాబ్‌లో 'బేబీ క్లోన్'ను సృష్టించిన 48 ఏళ్ల శ్రీమంతుడు!
Biohacker Bryan Johnson
Balaraju Goud
|

Updated on: Jul 24, 2026 | 12:03 PM

Share

అమెరికన్ టెక్ బిలియనీర్, ‘రివర్స్ ఏజింగ్’ పిచ్చిగా భావించే బ్రయాన్ జాన్సన్ (48) మరోసారి ఆన్‌లైన్‌లో హాట్ టాపిక్‌గా మారారు. వృద్ధాప్యాన్ని జయించి, అమరత్వం సాధించాలనే లక్ష్యంతో ఉన్న ఆయన, ల్యాబ్‌లో తన సొంత “బేబీ క్లోన్”ను సృష్టించినట్లు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించారు. బేబీ బ్రయాన్ అని పిలుచుకుంటున్న ఈ చిన్న క్లోన్ ప్రస్తుతం ఒక పెట్రీ డిష్‌లో పెరుగుతోందని చెప్పడం పెద్ద కలకలాన్నే రేపింది.

తన సొంత శరీరం నుంచి సేకరించిన రక్త కణాలను అత్యాధునిక పద్ధతుల ద్వారా పిండ దశలోకి మార్చినట్లు బ్రయాన్ తెలిపాడు. ఈ క్లోన్‌ను ఉపయోగించడం ద్వారా కొత్త అవయవాలను పెంచుకోవచ్చని, కొత్త మందులను పరీక్షించవచ్చని, తన శరీరంలోకి యవ్వన కణాలను ఎక్కించుకోవచ్చని అతను నమ్ముతున్నాడు. సరళంగా చెప్పాలంటే, బ్రియన్ తనను తాను యవ్వనంగా ఉంచుకోవడానికి తన సొంత క్లోన్‌ను ఉపయోగించాలనుకుంటున్నాడు. అయితే, ఇటీవల ఆయనకు ఆటోఇమ్యూన్ గ్యాస్ట్రైటిస్ (AIG) అనే అరుదైన కడుపు సంబంధిత వ్యాధి నిర్ధారణ అయింది. దీనికి నిర్దిష్టమైన వైద్యం లేదు. యవ్వన కణాలను తన శరీరంలోకి ఎక్కించుకోవడం ద్వారా వ్యాధిని నయం చేసుకోవడమే కాకుండా వృద్ధాప్యాన్ని నిరోధించవచ్చని ఆయన భావిస్తున్నారు.

యవ్వనాన్ని కాపాడుకోవడానికి ఏటా దాదాపు 2 మిలియన్ డాలర్లు (రూ. 20 కోట్లు) ఖర్చు చేసే బ్రయాన్ వాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మద్దతుదారులు దీనిని వైద్య విప్లవంగా కొనియాడుతుంటే, విమర్శకులు మాత్రం ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేస్తున్నారు. గతంలో 2002 డిసెంబర్ 27న, బ్రిగిట్టే బోయిసెలియర్ అనే శాస్త్రవేత్త ఈవ్ అనే అమ్మాయిని క్లోనింగ్ చేశానని ప్రకటించి కలకలం సృష్టించారు. అయితే, ఆధారాలు వెతికినప్పుడు, ఆ వాదన పూర్తిగా అబద్ధమని తేలింది. ఆ తర్వాత, తైవాన్ శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి వాదనలే చేశారు, కానీ వారి వాదనలు కూడా అబద్ధమని తేలాయి. వాస్తవం ఏమిటంటే, ఇప్పటివరకు ఏ ఒక్క మానవుడిని కూడా క్లోనింగ్ చేయలేదు.

మానవ క్లోనింగ్ వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. కఠినమైన చట్టాలు మరియు నైతిక ఆందోళనలు. మనిషి ప్రతిరూపాన్ని సృష్టించడం మానవ గౌరవానికి భంగం కలిగించడంగా భావిస్తున్నారు. ఈ కారణంగానే ఐక్యరాజ్యసమితి (UN)లో ఫ్రాన్స్, జర్మనీ, రష్యాతో సహా ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాలలో పూర్తిగా నిషేధించారు. వ్యాధుల నయానికి యూకే, జపాన్ వంటి దేశాల్లో కఠిన నిబంధనల మధ్య దీనికి అనుమతి ఉంది. థెరప్యూటిక్ క్లోనింగ్ అంటే చికిత్స కోసం కణాలను సృష్టించడానికి మాత్రమే అనుమతినిచ్చింది. అమెరికాలో దీనిపై సరైన కేంద్ర చట్టం లేకపోయినప్పటికీ, పూర్తిస్థాయి మానవ క్లోన్‌ను సృష్టించడం ఇప్పటికీ చట్టవిరుద్ధం, అసాధ్యం. బ్రయాన్ వాదనలు ఎంతవరకు నిజమో, ఇది అమరత్వానికి బాటలు వేస్తుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us