స‌కాలంలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు: సీఈసీ

| Edited By:

Aug 11, 2020 | 4:43 PM

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని బీహార్‌లోని రాజకీయ పార్టీల డిమాండ్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. స‌కాలంలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వ‌హిస్తామ‌ని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

స‌కాలంలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు: సీఈసీ
Follow us on

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని బీహార్‌లోని రాజకీయ పార్టీల డిమాండ్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. స‌కాలంలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వ‌హిస్తామ‌ని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కరోనావైరస్ సంక్షోభం, వరదల ప్రభావంవల్ల బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఎన్నిక‌లు వాయిదా ప‌డుతాయ‌నే ప్ర‌చారం జోరందుకుంది. కానీ కేంద్ర ఎన్నిక‌ల సంఘం బీహార్ ఎన్నిక‌ల వాయిదా వార్త‌ల‌ను తోసిపుచ్చింది.

సీఈసీ సునీల్ అరోరా మాట్లాడుతూ.. కోవిద్-19 వ్యాప్తి కారణంగా.. తాము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వ‌హిస్తామ‌ని స్పష్టంచేశారు. రాష్ట్ర జనతాదళ్ (ఆర్జెడి), లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) తో సహా బీహార్ లోని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేయాలని పోల్ ప్యానెల్ ను కోరాయి. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా లక్షల మంది ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం మంచిది కాదని లోక్ జనశక్తి పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలిపేందుకు ఈసీ ఆగ‌స్టు 11 వ‌ర‌కు గ‌డువు విధించింది. మ‌రోవైపు నవంబర్‌ 29తో బీహార్ అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది.

Read More:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పీహెచ్‌సీల్లో 24 గంటల సేవలు..

గుడ్ న్యూస్: ఔట్‌సోర్సింగ్‌ నర్సుల జీతాల పెంపు