మరికాసేపట్లో బీహార్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్

బీహార్​లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 55 కేంద్రాల్లో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు. 243 అసెంబ్లీ స్థానాలకుగాను 3 దశల్లో జరిగిన పోలింగ్ కు సంబంధించి, ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు.. అనంతరం ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ చేస్తారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో 414 హాళ్లు […]

మరికాసేపట్లో బీహార్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్
Follow us

|

Updated on: Nov 10, 2020 | 7:14 AM

బీహార్​లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 55 కేంద్రాల్లో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు. 243 అసెంబ్లీ స్థానాలకుగాను 3 దశల్లో జరిగిన పోలింగ్ కు సంబంధించి, ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు.. అనంతరం ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ చేస్తారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో 414 హాళ్లు సిద్ధం కాగా.. ఒక్కో హాల్‌కు 7 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఆర్జేడీ​ యువనేత తేజస్వీ యాదవ్​ పోటీచేస్తున్న రాఘోపుర్​ ఫలితంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. హసన్​పుర్​ నుంచి తేజస్వీ సోదరుడు తేజ్​ప్రతాప్​ యాదవ్​ బరిలో నిలిచారు. మహాకుటమికే బీహార్​ ప్రజలు పగ్గాలు అప్పగించనున్నారని ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు కట్టిన సంగతి తెలిసిందే.