మహా ప్రభో… ఈ బుడగలో ఉండలేము..!

కుటుంబ సభ్యులు దూరంగా బయో బుడగల్లో ఉండటం కాదంటున్నారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. బుడగ తర్వాత బుడగ భయంకరంగా అనిపిస్తుందని ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ వెల్లడించాడు...

మహా ప్రభో... ఈ బుడగలో ఉండలేము..!
Follow us

|

Updated on: Nov 10, 2020 | 12:47 AM

Mitchell Starc : కుటుంబ సభ్యులు దూరంగా బయో బుడగల్లో ఉండటం కాదంటున్నారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. బుడగ తర్వాత బుడగ భయంకరంగా అనిపిస్తుందని ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ వెల్లడించాడు. క్రికెటర్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని అభిప్రయా పడ్డాడు. బయటి ప్రపంచంతో అనుబంధం లేకుండా కట్టదిట్టమైన నిబంధనల మధ్య ఉండటం ఎక్కువ కాలం ఉండలేరని స్పష్టం చేశాడు.

ఇప్పటికే చాలామంది క్రికెటర్లు బయో బుడగలపై మాట్లాడారు. ఐపీఎల్‌లో ఇలాంటి వాతావరణంలో ఉన్నందువల్లే బిగ్‌బాష్ లీగులో తాము ఆడలేమని డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌ స్పష్టం చేశారు. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ సైతం బుడగల్లో కష్టమేనన్న సంగతి తెలిసిందే.

‘బుడగల్లో ఎక్కువ కాలం కొనసాగలేం. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా హోటల్‌ గదిలోనే ఉండాలి. కొందరు ఆటగాళ్లైతే వారి కుటుంబాలు, పిల్లలను చూసి చాలా కాలమైంది. అలాంటివారు ఐపీఎల్‌లో చాలామంది ఉన్నారు. క్రికెట్‌ ఆడాలి కాబట్టి వీటిపై ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు. కానీ ఆటగాళ్లు, సిబ్బంది, అధికారులు ఎంతకాలమని బుడగల్లో ఉండగలరు? వీటికి సమాధానాలు చెప్పాల్సిందే. కేవలం ఐపీఎల్‌ ఆడేవారు మళ్లీ ఐపీఎల్‌కే వస్తారు. డబ్బు తీసుకుంటారు. వారికి ఫర్వాలేదు. కానీ మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి?’ అని స్టార్క్‌ ప్రశ్నించాడు.