Bigg Boss 4 : డ్యాన్స్ లతో హోరెతించిన కంటెస్టెంట్స్ .. హాట్ హాట్ స్టెప్పులతో అదరగొట్టిన మోనాల్, దివి
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అంగరంగ వైభవంగా మొదలైంది. హోస్ట్ నాగార్జున అదిరిపోయే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చి ఫినాలేకు ఊపు తెచ్చారు. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా వచ్చిన వాళ్ళందరిని మళ్ళీ స్టేజ్ పైకి తీసుకు వచ్చారు.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అంగరంగ వైభవంగా మొదలైంది. హోస్ట్ నాగార్జున అదిరిపోయే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చి ఫినాలేకు ఊపు తెచ్చారు. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా వచ్చిన వాళ్ళందరిని మళ్ళీ స్టేజ్ పైకి తీసుకు వచ్చారు. ఇక స్టేజ్ పైకి వచ్చిన కంటెస్టెంట్స్ డ్యాన్స్ లతో హోరెతించారు. వీరిలో మోనాల్, దివి డ్యాన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదిరిపోయే డాన్సుతో మెహబూబ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక హాట్ హాట్ డాన్సులతో మోనాల్ గజ్జర్, దివి ఆకట్టుకున్నారు . కుమార్ సాయి, గంగవ్వ ఒకేసారి స్టేజీపైకి వచ్చారు. నాది నీకిలీసు గొలుసు పాటతో కరాటే కళ్యాణి ఎంట్రీ ఇచ్చారు. స్వాతి దీక్షిత్ కూడా మసాలా సాంగ్ తో స్టేజ్ పైకి వచ్చేసింది. రావణా సాంగ్ తో అమ్మ రాజశేఖర్ స్టేజ్ పైకి వచ్చాడు. అవినాష్ ఫ్యామిలీ పార్టీ అంటూ సందడి చేసాడు. ఇలా గ్రాండ్ గా బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే మొదలైంది.




