Bigg Boss 4: పోలీసులను ఆశ్రయించిన మోనాల్ గజ్జర్.. అభిజిత్ ఫ్యాన్స్‌పై ఫిర్యాదు.. అసలు సంగతి ఇదే..
Bigg Boss 4: బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో స్పెషల్ కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ అని చెప్పవచ్చు. ఎమోషన్ ఏదైనా కూడా ఆమె కళ్ల వెంట నీటి ప్రవాహం...
Bigg Boss 4: బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో స్పెషల్ కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ అని చెప్పవచ్చు. ఎమోషన్ ఏదైనా కూడా ఆమె కళ్ల వెంట నీటి ప్రవాహం ఏరులై పారేది. దీనితో ఆమెకు నర్మదా అనే పేరు స్థిరపడిపోయింది. కొన్నిసార్లు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లతో పాటు హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా మోనాల్‌ని నర్మదా అని పిలిచిన సందర్భాలు లేకపోలేదు. ఇదిలా ఉంటే 14వ వారంలో మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా జోర్దార్ సుజాతకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ట్రోలింగ్‌కు స్పందిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
”ఓ వీకెండ్‌లో డీప్‌నెక్ డ్రెస్ వేసుకుని షోలో పాల్గొన్నాను. దానికి బాగా ట్రోల్ చేశారు. ఎంతగానో బాధేసింది. అసలు ఆ రోజు నాకు ఆరోగ్యం బాగోలేదు. తలకు నూనెతో మేకప్ వేసుకుని అలాగే కూర్చున్నాను. కనీసం కూర్చోడానికి కూడా ఓపిక లేదని” మోనాల్ అసలు విషయాన్ని బయటపెట్టింది. అటు తన సోదరి హేమాలిపై వచ్చిన ట్రోలింగ్ విషయాన్ని కూడా ప్రస్తావించిన మోనాల్.. ఆమె అభికి వ్యతిరేకంగా మాట్లాడకపోయినా.. అతడి ఫ్యాన్స్ ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారంటూ మండిపడింది.
గతంలో అభిజిత్ తన వెనకాల మాట్లాడాడు కాబట్టి.. హౌస్‌లోకి వచ్చినప్పుడు హేమాలి అతడికి ఓ సలహా ఇచ్చింది. నా వెనుక కాకుండా నేరుగా మాట్లాడమని అభికి చెప్పింది. అందులో ఎలాంటి తప్పూ లేదు.. అక్కడ అభిని చెడుగా చిత్రీకరించింది లేదని మోనాల్ చెప్పుకొచ్చింది. అయినా సరే అభిజిత్ ఫ్యాన్స్ తన సోదరిపై నీచం కామెంట్స్ చేయడమే కాకుండా చంపుతామని బెదిరిస్తున్నారు. అందుకే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని తాను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా మోనాల్ గజ్జర్ వివరించింది. ఇక ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
Also Read:
బిగ్ బాస్ 4: టైటిల్ రేసులో టాప్‌కు ఎగబాకుతున్న అరియానా.! ఈసారి తెలుగమ్మాయి ట్రోఫీ కొట్టగలదా.?
కెప్టెన్‌గా స్మిత్‌కు ఇంకో ఛాన్స్ ఎండుకివ్వకూడదు.? సెలెక్టర్లపై ఆసీస్ మాజీ ప్లేయర్ ఫైర్.!
తొలి టెస్టు మ్యాచ్‌కు బరిలోకి దిగనున్న నటరాజన్.. ప్రత్యర్ధులకు ఇక చుక్కలు ఖాయం..
బీటెక్, డిగ్రీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఐబీఎం, టాస్క్ మధ్య కీలక ఒప్పందం..
తమిళ రాజకీయాల్లో సంచలనం.. తలైవా రజినీకాంత్ పార్టీ పేరు, గుర్తు ఖరారు..! వివరాలివే..